News February 3, 2025

వనపర్తి: సబ్సిడీ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అర్హులైన దివ్యాంగులకు ఆర్థిక పునరావాస పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకు సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి సుధారాణి తెలిపారు. 100% రాయితీతో రూ.50,000 చొప్పున 20 యూనిట్లు మంజూరు చేసిన్నారు. మంజూరు నిమిత్తం అర్హులైన దివ్యాంగులను tg obmms.cgg.gov.in వెబ్ సైట్లో ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు పోర్టల్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News February 3, 2025

వికారాబాద్ ప్రజావాణిలో 106 దరఖాస్తులు

image

వికారాబాద్ ప్రజావాణిలో 106 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రజావాణిలో కారుణ్య నియామకాలు, ఆపద్బంధువు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్, రైతు భరోసా, రుణ మాఫీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు, వ్యవసాయ, పశు సంవర్ధక శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కార దిశగా కృషి చేయాలని కలెక్టర్ అధికారుల సూచించారు.

News February 3, 2025

ఇది రాహుల్ అవివేకానికి నిదర్శనం: కిషన్ రెడ్డి

image

యూపీఏ ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎన్డీఏ ప్రభుత్వానికి ఆపాదించడం రాహుల్ గాంధీ అవివేకానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో 2.9 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగితే ఎన్డీఏ పాలనలో ఒక్క 2024లోనే 4.9 కోట్లు సృష్టించినట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొందని Xలో తెలిపారు. వివిధ రంగాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనతో పోలిస్తే NDA ప్రభుత్వంలోనే ఉపాధిలో వృద్ధి ఉందని వెల్లడించారు.

News February 3, 2025

కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి సీతక్క

image

ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవితో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. అంగన్వాడీ సెంటర్లకు అదనపు నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరాన్ని వివరించారు.