News February 3, 2025
వనపర్తి: సబ్సిడీ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

అర్హులైన దివ్యాంగులకు ఆర్థిక పునరావాస పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకు సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి సుధారాణి తెలిపారు. 100% రాయితీతో రూ.50,000 చొప్పున 20 యూనిట్లు మంజూరు చేసిన్నారు. మంజూరు నిమిత్తం అర్హులైన దివ్యాంగులను tg obmms.cgg.gov.in వెబ్ సైట్లో ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు పోర్టల్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News February 12, 2026
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: ASF ఎస్పీ

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చడం వంటి కార్యక్రమాలకు అనుమతి లేదని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు. గెలిచిన అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News February 12, 2026
విజయ్ మాల్యా INDకు వస్తేనే పిటిషన్‌ను విచారిస్తాం: హైకోర్టు

తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ <<17636225>>విజయ్ మాల్యా<<>> దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీన్ని విచారించాలంటే ఆయన ఇండియాకు తిరిగి రావాలని స్పష్టం చేసింది. ‘ఉద్దేశపూర్వకంగా కోర్టుకు హాజరుకాని వ్యక్తులు ఉపశమనం కోరలేరు. ఈ పిటిషన్‌ను కొట్టేయకుండా మరో అవకాశమిస్తున్నాం. ఆయన వస్తారో లేదో పేర్కొంటూ అఫిడవిట్ వేయండి’ అని సూచిస్తూ FEB 18కి వాయిదా వేసింది.
News February 12, 2026
హెల్మెట్ ధారణపై అవగాహన కల్పిస్తాం: చిత్తూరు SP

జరిమానాల ద్వారా కాకుండా అవగాహన ద్వారా హెల్మెట్ వినియోగం పెంచేలా కృషి చేస్తామని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించే పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఆటోలపై వాటిని అతికించారు. రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు వెల్లడించారు. ప్రమాదాలలో ఎక్కువ భాగం బైక్, ఆటోలే కారణం అవుతున్నాయని చెప్పారు.


