News March 26, 2025

వనపర్తి: సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వండి: డీఎంహెచ్వో

image

ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రయత్నించాలని లేదంటే చర్యలు తప్పవని వనపర్తి జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు హెచ్చరించారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సిజేరియన్‌లకు ప్రాధాన్యత ఇస్తే చర్యలు తప్పవన్నారు.

Similar News

News July 8, 2025

యాప్స్‌లో మోసం.. నాలుగింతలు వసూలు!

image

రైడ్ పూలింగ్ యాప్స్‌ల దోపిడీపై ఓ మహిళ చేసిన ట్వీట్ వైరలవుతోంది. బెంగళూరుకు చెందిన మహిళ 2.6kms వెళ్లేందుకు ఆటో బుక్ చేయగా రూ.172.45 చూపించింది. అదే దూరానికి డైరెక్ట్‌గా ఆటోలో వెళ్తే రూ.39 ఛార్జీని తీసుకున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. దీంతో యాప్స్‌లో జరుగుతున్న మోసాలపై చర్చ మొదలైంది. Ola, Rapido, Uber వంటి యాప్స్‌లో స్కామ్స్ జరుగుతున్నాయని, తామూ ఈ వ్యత్యాసాన్ని గమనించినట్లు పలువురు చెబుతున్నారు.

News July 8, 2025

కామవరపుకోట: బస్సు ఢీకొని ఒకరు మృతి

image

కామవరపుకోట మండలం తడికలపూడి శ్రీనివాస వేబ్రిడ్జి వద్ద మంగళవారం జరిగిన యాక్సిడెంలో ఒకరు మృతి చెందారు. ఓ ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News July 8, 2025

భూపాలపల్లి: జిల్లా వ్యాప్తంగా 35.6 మి.మీ వర్షపాతం

image

గడిచిన 24 గంటలలో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 35.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారిగా చూస్తే మహాదేవపూర్ 3.8 మి.మీ, పలిమెల 3.0 మి.మీ, మహముత్తారం 10.4 మి.మీ, కాటారం 3.8 మి.మీ, మల్హర్ 8.6 మి.మీ రేగొండ 2.6 మి.మీ, భూపాలపల్లి 3.4 మి.మీగా నమోదైంది.