News April 7, 2025

వనపర్తి: ‘సింగోటం గుడిలో ప్రేమ జంట పెళ్లి చేస్తాం’

image

తమకు పెళ్లి చేయాలని వనపర్తి జిల్లా పానగల్ PSకు వచ్చిన <<16017433>>నందిని, మహేందర్<<>> పెళ్లి త్వరలో చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. నందిని హైదరాబాద్‌లో ఫామ్-డి చదువుతోందని, మహేందర్ డిగ్రీ చదివి జాబ్ సెర్చ్ చేస్తున్నాడన్నారు. ఇద్దరు మేజర్లు, అందులోనూ చదువుకున్న వారు కావడంతో వారి పెళ్లికి కుటుంబీకులను ఒప్పించామని చెప్పారు. మంచి ముహూర్తం చూసి త్వరలో కొల్లాపూర్ పరిధి సింగోటం గుడిలో పెళ్లి చేస్తామన్నారు.

Similar News

News April 8, 2025

MBNR: దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపుహాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 92 ఫిర్యాదులను స్వీకరించారు. ఏ వారం దరఖాస్తులు ఆ వారమే పరిష్కరించాలని పదేపదే హెచ్చరిస్తున్న నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. శనివారంలోగా దరఖాస్తులను పరిష్కరించి తనకు నివేదిక ఇవ్వాలన్నారు.

News April 7, 2025

మహబూబ్‌నగర్: ‘మాంసం వారానికి ఒకసారే తినండి’

image

ఉమ్మడి <<16019120>>పాలమూరులో<<>> 18 ఏళ్లు పైబడిన వారిలో సగటున 20 శాతం అంటే 87,739 మంది అధిక రక్తపోటు బాధితులే ఉన్నారు. క్యాన్సర్ రోగులు 188మంది, మధుమేహ వ్యాధిగ్రస్థులు 50,421మంది ఉన్నారు. మటన్, ఆయిల్‌ఫుడ్, అధిక ఉప్పు, పచ్చడి, తంబాకు, గుట్కా, బ్రెడ్, బేకరీ ఫుడ్ తినొద్దని, స్కిన్‌లెస్ చికెన్, గుడ్డు తెల్ల సొన, ఉడకబెట్టిన కూరగాయలు, పాలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వారానికి ఒకసారి మాత్రమే మాంసం తినాలన్నారు.

News April 7, 2025

వనపర్తి: తమకు పెళ్లి చేయాలంటూ PSకు ప్రేమ జంట

image

తమకు పెళ్లి చేయాలంటూ ఓ ప్రేమ జంట PSకు వచ్చిన ఘటన వనపర్తి జిల్లా పానగల్‌లో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రేమద్దుల గ్రామానికి చెందిన నందిని(22), మహేందర్(29) రెండేళ్లుగా లవ్ చేసుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అమ్మాయి PSలో ఫిర్యాదు చేసింది. ఇద్దరు మేజర్లు కావడంతో కుటుంబీకులతో పోలీసులు మాట్లాడి ఒప్పించారు. త్వరలో వారి పెళ్లి చేస్తామన్నారు.

error: Content is protected !!