News April 7, 2025
వనపర్తి: ‘సింగోటం గుడిలో ప్రేమ జంట పెళ్లి చేస్తాం’

తమకు పెళ్లి చేయాలని వనపర్తి జిల్లా పానగల్ PSకు వచ్చిన <<16017433>>నందిని, మహేందర్<<>> పెళ్లి త్వరలో చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. నందిని హైదరాబాద్లో ఫామ్-డి చదువుతోందని, మహేందర్ డిగ్రీ చదివి జాబ్ సెర్చ్ చేస్తున్నాడన్నారు. ఇద్దరు మేజర్లు, అందులోనూ చదువుకున్న వారు కావడంతో వారి పెళ్లికి కుటుంబీకులను ఒప్పించామని చెప్పారు. మంచి ముహూర్తం చూసి త్వరలో కొల్లాపూర్ పరిధి సింగోటం గుడిలో పెళ్లి చేస్తామన్నారు.
Similar News
News November 24, 2025
గోదావరిఖని ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించిన నూతన డీసీపీ

పెద్దపల్లి జోన్ గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలు, నేర నియంత్రణ చర్యలు, పోలీసింగ్ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు నూతనంగా నియమితులైన డీసీపీ సోమవారం ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. సబ్ డివిజన్ పరిధిలోని స్టేషన్ల వారీగా నేర గణాంకాలు, భద్రతా చర్యలు, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజా సేవల అమలు విధానాన్ని కూడా ఆయన తెలుసుకున్నారు.
News November 24, 2025
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో వచ్చే అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన మీకోసంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తొలుత అధికారులతో సమావేశమై ఇప్పటి వరకు వచ్చిన అర్జీల పరిష్కార చర్యలపై శాఖల వారీగా సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న అర్జీలను తక్షణం పరిష్కరించాలన్నారు.
News November 24, 2025
సూర్యాపేట: మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా..

భవన, ఇతర నిర్మాణ రంగాలకు చెందిన కార్మికులు సంక్షేమం కోసం ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ప్రభుత్వం లేబర్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశం పెట్టిందని, కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ కే.సీతారామారావు కోరారు. ప్రమాదానికి గురైతే ప్రాణ నష్టనికి రూ.10 లక్షలు, వైకల్యం పొందితే రూ.6 లక్షలు ఆర్థిక సాయం అందించనుంది. ఇప్పటికే ఈ పథకంలో జిల్లాలో 1,35,885 కార్మికులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.


