News February 7, 2025
వనపర్తి: స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738893994442_1072-normal-WIFI.webp)
స్కూల్ బస్సు కింద పడి బాలిక మృతి చెందిన ఘనట హయత్‌నగర్‌లో జరిగింది. స్థానికుల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవాదిపల్లి వాసి నర్సింహ పెద్దఅంబర్‌పేటలో ఉంటున్నారు. ఆయన కుమార్తె రిత్విక హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో పాప బస్సు కింద పడి నలిగిపోయిందని వాపోయారు.
Similar News
News February 7, 2025
మీ బ్యాంకు వడ్డీరేటు తగ్గించకుంటే ఏం చేయాలంటే..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738921091534_1199-normal-WIFI.webp)
RBI కత్తిరించిన 25bps వడ్డీ ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు అందించాలి. అయితే కొన్ని పట్టించుకోకపోవచ్చు. కొన్ని కొంతే తగ్గించొచ్చు. అలాంటప్పుడు మీ హోమ్‌లోన్ EMI తగ్గించుకొనేందుకు ఓ దారుంది. అదే తక్కువ వడ్డీ వసూలు చేసే బ్యాంకుకు మీ లోన్ బదిలీ చేసుకోవడం. దీనినే రీఫైనాన్సింగ్ అంటారు. ఈ పోటీ వాతావరణంలో కస్టమర్‌ను వదులుకొనేందుకు ఏ బ్యాంకూ ఇష్టపడదు. మీరు బార్‌గెయిన్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ పొందొచ్చు.
News February 7, 2025
YCP మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తులు సీజ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738924262771_1032-normal-WIFI.webp)
AP: విశాఖపట్నం వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వైజాగ్‌లోని రూ.44.74 కోట్ల విలువైన హయగ్రీవ ఆస్తులు అటాచ్ చేసింది. కాగా వృద్ధులు, అనాథలకు సేవ చేసేందుకు కేటాయించిన హయగ్రీవ భూములను ఆయన దుర్వినియోగం చేసినట్లు ఈడీ గతంలో తేల్చింది. ప్లాట్లుగా విభజించి వేర్వేరు వ్యక్తులకు తప్పుడు పత్రాలతో విక్రయించినట్లు గుర్తించింది.
News February 7, 2025
విశాఖ: టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి మరో నామినేషన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738924953485_20522720-normal-WIFI.webp)
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం నాలుగు నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. పీఆర్టీయూ మద్దతుతో బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, స్వతంత్ర అభ్యర్థులు నూకల సూర్యప్రకాష్,రాయల సత్యన్నారాయణ, పోతల దుర్గారావు తమ మద్దతుదారులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ వారి చేత ప్రమాణం చేయించారు.ఇప్పటి వరకు మొత్తం 8 నామినేషన్లు వచ్చాయి.