News February 7, 2025
వనపర్తి: స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి

స్కూల్ బస్సు కింద పడి బాలిక మృతి చెందిన ఘనట హయత్‌నగర్‌లో జరిగింది. స్థానికుల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవాదిపల్లి వాసి నర్సింహ పెద్దఅంబర్‌పేటలో ఉంటున్నారు. ఆయన కుమార్తె రిత్విక హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్లో LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో పాప బస్సు కింద పడి నలిగిపోయిందని వాపోయారు.
Similar News
News March 24, 2025
మార్చి 24: చరిత్రలో ఈరోజు

1603 : బ్రిటిషు మహారాణి ఎలిజబెత్ మరణం
1775 : కవి, వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు జననం
1882 : క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్‌ను రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు
1977 : భారత ప్రధానిగా మొరార్జీ దేశాయ్ బాధ్యతలు (ఫొటోలో)
1984 : భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డిసౌజా జననం
1991: సినీ గేయ రచయిత చెరువు ఆంజనేయ శాస్త్రి మరణం
* ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం
News March 24, 2025
MHBD: బెట్టింగ్తో జీవితాలు చిత్తు: ఎస్పీ

బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కోల్కోలేని విధంగా ఆర్థిక నష్టం జరిగితే చివరకు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయని ఐసీసీ నిర్వహించే మ్యాచులు క్రికెట్ ఆట అయితే ఈ ఐపీఎల్ అనేది తిమింగలాలు నిర్వహించే ఒక వ్యాపారం అన్నారు. తల్లిదండ్రులు ఈ మ్యాచులు ప్రారంభమయ్యాక తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
News March 24, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 24, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.17 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.22 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.28 గంటలకు
ఇష: రాత్రి 7.40 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.