News February 7, 2025
వనపర్తి: స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి

స్కూల్ బస్సు కింద పడి బాలిక మృతి చెందిన ఘనట హయత్‌నగర్‌లో జరిగింది. స్థానికుల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవాదిపల్లి వాసి నర్సింహ పెద్దఅంబర్‌పేటలో ఉంటున్నారు. ఆయన కుమార్తె రిత్విక హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో పాప బస్సు కింద పడి నలిగిపోయిందని వాపోయారు.
Similar News
News February 14, 2026
భూపాలపల్లి: ఈ నవ్వించే కుర్రాడు మనోడే!

మీమ్స్, కామెడీ వీడియోల్లో ఈ కుర్రాడి వీడియో తప్పనిసరి అయిపోయింది. చాలా మంది ఈ కుర్రోడి గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే, ఈ కుర్రాడు, అసలు మనోడు కాదని అనుకుంటారు. కానీ, ఇతను భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కోర్లకుంట గ్రామానికి చెందిన వ్యక్తి చాలా మందికి తెలియదు. ఈయన పేరు అరుణ్. పేద కుటుంబంలో జన్మించిన ఈ కుర్రాడు పదో తరగతి చదివాడు. తర్వాత చదువు మానేశాడు.
News February 14, 2026
NLG: సేవలో ఆ ఇద్దరు ఉపాధ్యాయులు ఆదర్శం!

ఈ గురువులు.. చదువు చెప్పడానికే పరిమితం కాలేదు. విద్యార్థుల భవిష్యత్తుకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. కట్టంగూర్ (M) మల్లారం ప్రాథమిక పాఠశాల HM సమ్మెటి తిరుమలేష్, ఉపాధ్యాయుడు షరీఫ్ తమ సేవాభావంతో స్థానికుల మెప్పు పొందుతున్నారు. కట్టంగూర్ శివారులోని పేలాల పరిశ్రమలో పని చేస్తున్న వలస కార్మికుల పిల్లలను ప్రతి రోజు ఉదయం ద్విచక్రవాహనంపై పాఠశాలకు తీసుకెళ్ళి సాయంత్రం మళ్లీ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తున్నారు.
News February 14, 2026
కర్నూలులో 30 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి: మంత్రి

కర్నూలులో 30 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రకటించారు. శనివారం బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ.. సాగునీటి కోసం ఎదురుచూసే రాయలసీమ రైతుల కలలను ఈ బడ్జెట్ సాకారం చేస్తుందని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని తెలిపారు. సీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని భరోసా ఇచ్చారు.


