News April 17, 2025
వనపర్తి: హక్కులను కాపాడుకోవాలి: పి.జయలక్ష్మి

మే 20న దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.జయలక్ష్మి కోరారు. సీఐటీయూ వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఎం.రాజు అధ్యక్షతన గురువారం వనపర్తిలో నిర్వహించిన ట్రేడ్ యూనియన్ శిక్షణ తరగతులకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడాలని అన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 16, 2025
TDP ప.గో జిల్లా అధ్యక్షుడిగా రామరాజు..?

TDP పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు (కలవపూడి రాంబాబు) నియమితులైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం APIIC ఛైర్మన్‌గా ఉన్నారు. గతంలోనూ TDP జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రెండో సారి కూడా రామరాజును జిల్లా అధ్యక్షుడిగా నియమించడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
News December 16, 2025
ఆప్కాబ్, DCCB, PACSలలో అక్రమాలపై సభాసంఘం

AP: ఆప్కాబ్, DCCB, PACSలలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై స్పీకర్ ఏడుగురు MLAలతో సభాసంఘాన్ని నియమించారు. ఇందులో N.అమర్‌నాథ్ రెడ్డి ఛైర్మన్‌గా K.రవికుమార్, D.నరేంద్ర, B.శ్రీనివాస్, Y.వెంకట్రావు, B.రామాంజనేయులు, శ్రావణ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈ అంశంపై ఫిర్యాదులను అసెంబ్లీ సహాయ కార్యదర్శికి నేరుగా లేదా ‘apl.apcob@gmail.com’కి మెయిల్ పంపవచ్చని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ తెలిపారు.
News December 16, 2025
అమలాపురం: జిల్లా TDP అధ్యక్షుడిగా గుత్తుల సాయి?

అంబేడ్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ముమ్మిడివరానికి చెందిన గుత్తుల సాయి పేరు ఖరారు అయినట్లు ప్రచారం సాగుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సాయి.. ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు విజయంలో కీలక పాత్ర పోషించారని కార్యకర్తలు గుర్తుచేసుకుంటున్నారు. గతంలో గన్నవరం జడ్పీటీసీగా, ముమ్మిడివరం ఎంపీపీగా ఆయన సేవలందించారు. ఒక పర్యాయం స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు.


