News March 15, 2025
వనపర్తి: హక్కులపై అవగాహన అవసరం: వెంకటేశ్వర్లు

వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మార్చి 15న ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కలెక్టరేట్లోని పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో వినియోగదారులకు హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
Similar News
News December 13, 2025
రూ.3600 కోట్లతో హరియాణా క్లీన్ ఎయిర్ ప్లాన్!

గాలి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించేందుకు హరియాణా ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్తో MoU కుదుర్చుకుంది. రూ.3,600 కోట్లతో ‘హరియాణా క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్’ను ప్రారంభించింది. ఐదేళ్లలో ఢిల్లీ-ఎన్సీఆర్లో (National Capital Region) గాలి నాణ్యత మెరుగుపరచడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. 500 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, 50,000 ఈ-ఆటోలకు ప్రోత్సాహకాలు అందించడం వంటివి ప్రతిపాదనలో ఉన్నాయి.
News December 13, 2025
పెద్దపల్లి జోన్లో సెక్షన్ 163 BNSS అమలు: సీపీ

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి జోన్లోని అంతర్గాం, పాలకుర్తి, జూలపల్లి, ధర్మారం మండలాలలో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం ప్రకటించారు. ఎన్నికలు ప్రశాంతంగా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిర్వహించేందుకు ఈ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు.
News December 13, 2025
టమాటాలో బొడ్డు కుళ్లు/ పూత వైపు కుళ్లు నివారణకు సూచనలు

టమాటా అభివృద్ధి చెందే దశలో నీటి ఎద్దడి, మొక్కల్లో కాల్షియం లోపం వల్ల బొడ్డు కుళ్లు కనిపిస్తుంది. నత్రజని, నేలలో కరిగే పోటాషియం, మెగ్నిషియం ఎక్కువగా వాడటం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు నేలలో తేమ హెచ్చుతగ్గులు కాకుండా చూసుకోవాలి. భూమిలో తగినంత కాల్షియం ఉండేట్లు చూసుకోవాలి. పైరు కోత దశలో కాల్షియం నైట్రేట్ 7.5-10 గ్రాములు లేదా కాల్షియం క్లోరైడ్ 4 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


