News February 26, 2025
వనపర్తి: హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: నారాయణ

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు నారాయణ అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వనపర్తి కాంగ్రెస్ అంతర్గత కలహాలతో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. కలహాలను పక్కనపెట్టి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
Similar News
News November 5, 2025
రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయండి: కలెక్టర్

పత్తి రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం టేక్మాల్ రైతు వేదికలో పెద్దశంకరంపేట డివిజన్ వ్యవసాయ అధికారులతో కాటన్ కాపాస్ యాప్పై ఆయన సమీక్షించారు. డివిజన్ పరిధిలో 34,903 ఎకరాలలో పత్తి సాగు చేసిన రైతులకు యాప్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 5, 2025
TU: గెస్ట్ ఫ్యాకల్టీకి పోస్టుకు ఇంటర్వ్యూలు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని సౌత్ క్యాంపస్ చరిత్ర విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ తెలిపారు. సంబంధిత విభాగంలో 55% ఉత్తీర్ణత పొంది ఉండాలన్నారు. నెట్/సెట్/పీహెచ్డీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ నెల 7న ఉదయం 11.30గం.లకు బిక్కనూర్ సౌత్ క్యాంపస్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలి.
News November 5, 2025
నారాయణపురం: కోతుల దాడిలో వ్యక్తికి తీవ్రగాయాలు

కోతుల దాడిలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ ఘటన సంస్థాన్ నారాయణపురంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తన ఇంటి ఆవరణలో పనిచేస్తున్న శివ స్వామిపై కోతుల గుంపు ఒకసారిగా దాడి చేసింది. కోతుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో శివ స్వామి కిందపడి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాదుకు తరలించారు.


