News January 27, 2025
వనపర్తి: హాస్టల్ విద్యార్థి మృతి

గోపాల్పేట ఎస్సీ హాస్టల్లో విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఏదుట్లకు చెందిన భరత్ హాస్టల్లో ఉంటూ 8వ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం విద్యార్థికి మూర్చ రావటంతో హాస్టల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో విద్యార్థి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 8, 2025
జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ 5 నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 16వరకు అప్లై చేసుకోవచ్చు. లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.1000. వెబ్సైట్: https://cujammu.ac.in/
News November 8, 2025
NLR: 12న వైసీపీ ప్రజాపోరు యాత్ర

నెల్లూరు జిల్లా జిల్లా వ్యాప్తంగా ఈనెల 12న వైసీపీ ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించే ఈ యాత్ర జరగనుంది. వాల్ పోస్టర్లను నెల్లూరులో శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. ఎమ్మెల్సీలు మాధవరెడ్డి, మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
News November 8, 2025
DANGER: ఇయర్ఫోన్లు అధికంగా వాడుతున్నారా?

శరీరంలో ఇయర్ఫోన్ భాగమైపోయిందా అన్నట్లు కొందరు ఉదయం నుంచి రాత్రి వరకూ దానిని వాడుతుంటారు.. అలా గత మూడేళ్లుగా రోజుకు 12గంటలు ఇయర్ఫోన్లు వాడిన ఓ యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. వినికిడి తగ్గిపోవడం, ‘టిన్’ శబ్దం వినిపించడంతో ఆమె ENT ఆస్పత్రికి వెళ్లగా చెవిలో పొర ఇన్ఫెక్ట్ అయి చీము చేరిందని వైద్యులు తెలిపారు. ఇయర్ఫోన్ అతి వినియోగం వినికిడి శక్తిని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.


