News March 21, 2025
వనపర్తి: ‘75 మంది ఒకేషనల్ విద్యార్థులు గైర్హాజరు’

ప్రథమ సంవత్సరం ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయని వనపర్తి ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆరు సెంటర్లలో పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. 925 మంది విద్యార్థులకు గాను 850 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 75 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.
Similar News
News March 26, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

గత 5 రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 పెరిగి రూ.81,950లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 పెరగడంతో రూ.89,400 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధర రూ.1000 పెరగడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,11,000గా ఉంది.
News March 26, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 7010

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయి. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,030 పలకగా.. మంగళవారం రూ.7,045కి చేరింది. నేడు భారీగా తగ్గి రూ.7,010కి పడిపోయింది. ధర రూ.7,500 కి పైగా పలికేలా అధికారులు వ్యాపారులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
News March 26, 2025
మేయర్ పీఠం.. విశాఖ అభివృద్ధికి శాపం కానుందా?

విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు GVMC బడ్జెట్‌పై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2025-26కి సంబంధించి బడ్జెట్ సమావేశాన్ని ఈనెల 29న నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అయితే అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో YCP కార్పొరేటర్లను బెంగుళూరు తరలించారు. మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్లూ YCPకి చెందిన వారే కావడంతో వారి హాజరుపై అనుమానం నెలకొంది. దీంతో సమావేశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.