News March 27, 2025
వనపర్తి: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం పాలమూరు పరిధి MBNR, NRPT, GDWL, NGKL, WNPడీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRS చేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
Similar News
News April 25, 2025
నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు

నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గురువారం ఆర్మూర్‌లో 45.4, ముగ్పాల్ 45.3, ముప్కాల్, ఎడపల్లి, ఏర్గట్ల 45.1, మెండోరా, నిజామాబాద్ పట్టణం, కమ్మర్పల్లి, మోస్రా 45.0, ధర్పల్లి, కోటగిరి 44.9, ఆలూర్ 44.8, నందిపేట, నిజామాబాద్ రూరల్, సిరికొండ 44.7, మోర్తాడ్ 44.6, తుంపల్లి 44.5, మక్లూర్ 44.4, బోధన్, జనకంపేట, రెంజల్ 44.2, డొంకేశ్వర్, బాల్కొండ 44.1, సాలూరా 44, భీంగల్లో 43.9℃ ఉష్ణోగ్రత నమోదైంది.
News April 25, 2025
సత్తెనపల్లి: పుట్టిన రోజే అనంతలోకాలకు

సత్తెనపల్లి (M) రెంటపాళ్లలో నిన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం మేరకు.. మృతుడు మహేశ్ ఓ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. పుట్టిన రోజు కావడంతో విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వస్తుండగా DDపాలెం రోడ్డులో ఎదురుగా వచ్చిన పాల వ్యాన్ ఢీకొట్టింది. దీంతో మహేశ్ స్పాట్‌లోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News April 25, 2025
సెలవుపై వెళ్లిన కాకినాడ జిల్లా కలెక్టర్

కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సెలవుపై గురువారం సాయంత్రం హైదరాబాదుకు వెళ్లారు. తిరిగి సోమవారం విధులకు హాజరు కానున్నారు. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా జేసీ రాహుల్ మీనా వ్యవహరిస్తారు. నేడు పవన్ కళ్యాణ్ పర్యటనలో జేసీ పాల్గొంటారు.