News January 28, 2025
వనపర్తి: CPM చరిత్రలో తొలిసారి దళితునికి రాష్ట్ర కార్యదర్శి పదవి..!

ఎర్రజెండా చరిత్రలో మొదటిసారిగా దళితునికి రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కిందని సీపీఎం అమరచింత మండల కార్యదర్శి జీఎస్ గోపి అన్నారు. అమరచింతకు చెందిన జాన్ వెస్లీ ఎంపిక చరిత్రలోనే మొదటిసారిగా ఓ దళితునికి రాష్ట్ర కార్యదర్శిగా అత్యున్నత పదవి కట్టబెట్టడం ఆ పార్టీ నిబద్ధతకు నిదర్శనమన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా అత్యున్నత పదవి దక్కించుకున్న మొట్టమొదటి వ్యక్తిగా జాన్ వెస్లీ చరిత్ర సృష్టించాలని గోపి అన్నారు.
Similar News
News November 21, 2025
విశాఖ: ‘దళారులకు గంటా వార్నింగ్’

తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ భూములకు శనివారం నుంచి పరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఎకరాకు రూ.20 లక్షలు, 20 సెంట్ల భూమి ఇస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ ధర ఇప్పిస్తామని రైతులను మోసం చేస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. న్యాయమైన రైతుల కోరికలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
News November 21, 2025
ప.గో: ప్రియుడి మోసం.. విద్యార్థిని సూసైడ్

భీమవరం రూరల్ మండలం కొవ్వాడలో ఈ నెల 12న ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం వల్లే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థిని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్ఐ వీర్రాజు.. నెల్లూరుకు చెందిన నిందితుడు నవీన్ రెడ్డిని హైదరాబాద్లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
News November 21, 2025
నేడు గ్రేటర్ విశాఖ కౌన్సిల్ సమావేశం

జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరగనుండగా ఈ సమావేశంలో చర్చించేందుకు మొత్తం 90 అంశాలతో అజెండాను సిద్ధం చేశారు. వీటిలో ప్రధానంగా నగరంలోని వివిధ వార్డుల అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైనేజీ, వాటర్సప్లై వంటి మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. ముందస్తు వ్యూహరచనలో భాగంగా వైసీపీ తరఫున షాడో సమావేశాన్ని ఇప్పటికే నిర్వహించారు. సమావేశం ఉత్కంఠభరితంగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


