News March 21, 2025
వనపర్తి: GREAT.. హిందూ ఇంట్లో ముస్లింలకు ఇఫ్తార్ విందు

వనపర్తి జిల్లా ఆత్మకూరులో గురువారం రాత్రి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు స్థానిక కొండాపురం కురుమూర్తి ఆయన స్వగృహంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. దీంతో ముస్లిం సోదరులకు.. హిందూ సోదరుడు ఇఫ్తార్ విందు ఇవ్వడం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. సోదర భావాన్ని చాటుకున్న కురుమూర్తికి, ముస్లిం సోదరులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షఫీ మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 25, 2026
వేరుశనగలో జింక్ లోపం లక్షణాలు – నివారణ

వేరుశనగలో పంట నాణ్యత, దిగుబడి పెరగడానికి జింక్ చాలా కీలకం. ఈ సూక్ష్మపోషకం తగ్గినప్పుడు మొక్కలో ఎదుగుదల ఉండదు. ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఈనెలకు ఇరువైపులా తుప్పురంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని వారం వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్‌ను 3 పంటలకొకసారి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.
News February 25, 2026
మెదక్: పరీక్షా కేంద్రాల సందర్శించిన ఎస్పీ

నేడు ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును, భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశామని తెలిపారు.
News February 25, 2026
అర్జునుడి ప్రాణాలు కాపాడిన ఘటోత్కచుడు

కురుక్షేత్రంలో ఘటోత్కచుడి త్యాగం అసమానం. కర్ణుడి వద్ద ఉన్న అజేయమైన ‘వాసవి శక్తి’ నుంచి అర్జునుడిని రక్షించడమే ఇందుకు కారణం. యుద్ధంలో ఘటోత్కచుడు తన శక్తులతో కౌరవ సేనను అతలాకుతలం చేస్తుంటే, గత్యంతరం లేక కర్ణుడు ఆ శక్తిని ఘటోత్కచుడిపైనే ప్రయోగించాల్సి వచ్చింది. అలా ఘటోత్కచుడు వీరమరణం పొంది, అర్జునుడి ప్రాణాలు కాపాడి పాండవుల విజయానికి కారణమయ్యాడు. చనిపోతూ తన భారీ దేహంతో కౌరవ సైన్యాన్ని అణిచివేశాడు.


