News March 26, 2025
వనపర్తి POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన..?

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో రేపు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. కాగా వనపర్తి డీసీసీ చీఫ్గా రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ఉన్నారు. అయితే ఈ పదవి కోసం చీర్ల చందర్, సాయిచరణ్ రెడ్డి, L.సతీశ్ ఆశావహులుగా ఉన్నారు.
Similar News
News December 9, 2025
క్రీడాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా: మంత్రి

జిల్లాలో క్రీడాభివృద్ధితో పాటు క్రీడాకారుల సంక్షేమానికి నిరంతరం టీజీవీ సంస్థలు కృషి చేస్తాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఇటీవల దక్షిణ భారత స్థాయి సిలంబం పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను కర్నూలులోని తన నివాసంలో ఆయన మంగళవారం ఘనంగా సత్కరించారు. జిల్లా కార్యదర్శి మహావీర్ మాట్లాడుతూ.. దక్షిణ భారత స్థాయిలో జిల్లా క్రీడాకారులు అనేక పతకాలు సాధించారన్నారు.
News December 9, 2025
దేవరకద్ర: సర్పంచ్ అభ్యర్థి.. 20 హమీలతో బాండ్

దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి బీజేపీ అభ్యర్థిగా రోజా రమేష్ సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. తనను గెలిపిస్తే 20 హామీలు నెరవేరుస్తానని బాండ్ పేపర్ రాశారు. వీటిలో ప్రధానంగా శివాజీ విగ్రహం ఏర్పాటు, రోడ్లు, వీధిదీపాలు, గ్రంథాలయం, ఆదాయ వ్యయాలను గ్రామసభలో చూపిస్తానన్నారు. 3 ఏళ్లల్లో 70% హామీలను నెరవేరుస్తామని అన్నారు.
News December 9, 2025
బీచ్ రోడ్డులో నేవీ ఉద్యోగుల పరిశుభ్రత కార్యక్రమం

ఆర్కే బీచ్లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. INS డేగాకు చెందిన నేవీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 30 మంది నావికులు,10 మంది అధికారులు బీచ్ ప్రాంతంలో చెత్తను తొలగించారు. ఈ డ్రైవ్ను స్వచ్ఛత పఖ్వాడాలో భాగంగా చేపట్టినట్లు నేవీ అధికారులు తెలిపారు. తీర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.


