News November 17, 2024
వనాలు, సముద్ర, నదీ తీరాల బాట పట్టిన ప్రజానీకం
కార్తీక మాసం కావడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆదివారం వన సమారాధనలు జోరుగా సాగుతున్నాయి. దీంతో విజయవాడ, మచిలీపట్నం శివార్లలోని తోటలలో ఈ రోజు వనభోజనాల హడావిడి ఎక్కువగా ఉంది. సెలవురోజు కావడంతో పవిత్రమైన కార్తీక మాసంలో సముద్ర స్నానాల కోసం ప్రజలు హంసలదీవి, మంగినపూడి తదితర బీచ్‌లకు తరలివచ్చారు. అటు కృష్ణా నదీ తీరాన సైతం భక్తులు ఉదయం నుంచి పుణ్యస్నానాలు ఆచరించించారు.
Similar News
News November 17, 2024
విజయవాడలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి
విజయవాడ కృష్ణలంకలో ఆర్టీసీ డ్రైవర్‌పై మద్యం మత్తులో ఆదివారం ముగ్గురు వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. రాంగ్ రూట్లో వస్తున్న కారు యజమాని అందులో ఉన్న ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి తెగబడటంతో స్థానికులు అడ్డుకొని కృష్ణలంక పోలీసులకు సమాచారం అందించారు. ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సీఐ కృష్ణలంక సీఐ నాగరాజు తెలిపారు.
News November 17, 2024
VJA: పోలవరం ప్రాజెక్టుపై సీపీఐ నేత రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
సీపీఐ నేత రామకృష్ణ పోలవరం ప్రాజెక్టుపై ఆదివారం విజయవాడలో కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం తగ్గించి కేంద్రం రూ.25 వేల కోట్లు ఆదా చేసేందుకు కేంద్రం యత్నిస్తోందని ఆరోపించారు. విభజన బిల్లులోని 11వ షెడ్యూల్ ప్రకారం 6 ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై పారదర్శకంగా విచారణ జరిపించాలన్నారు.
News November 17, 2024
వాడవల్లి: బాలిక పుస్తకాల సంచిలో నాగుపాము
ముదినేపల్లి మండలం వాడవల్లిలో బాలిక పుస్తకాల సంచిలో నుంచి పాము రావడంతో కలకలం రేపింది. గ్రామానికి చెందిన వరలక్ష్మీ కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. యథావిధిగా శనివారం పుస్తకాల సంచిని తగిలించుకుని పాఠశాలకు బయలుదేరింది. మార్గం మధ్యలో సంచిలో నుంచి శబ్దాలు రావడం గమనించిన స్నేహితురాలు చూడగా నాగుపాము కనిపించింది. దీంతో స్థానికులు దాన్ని చంపడంతో పెను ప్రమాదం తప్పింది.