News July 31, 2024
వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు : డీఆర్వో
వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని సీతారామపురం డిఆర్ఓ కెవి ప్రసాద్ హెచ్చరించారు. ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉదయగిరి రేంజర్ ఉమామహేశ్వర్ రెడ్డి సూచనలతో సీతారామపురం మండలం చింతోడు, బోడసిద్ధాయపల్లి, గుండుపల్లి గ్రామాల ప్రజలకు అటవీ చట్టాలపై మంగళవారం అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమ దృష్టికి తీసుకురావాలని వారు సూచించారు.
Similar News
News December 22, 2024
నెల్లూరు జిల్లాలో తులం బంగారం రూ.78,470
నెల్లూరు జిల్లాలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,470లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.7,100లుగా ఉంది. కాగా 24 క్యారెట్ల బంగారం ధర శనివారంతో పోల్చితే రూ.700కు పెరిగింది. గడిచిన కొద్ది రోజులుగా జిల్లాలో మేలిమి బంగారం ధరలు తులం రూ.78వేలకు పైగా ఉండగా శనివారం కాస్త తగ్గి రూ.77వేలకు చేరింది.
News December 22, 2024
నెల్లూరు: బీచ్‌లో యువకుడు మృతి
ఆయన ఉద్యోగం కోసం కొద్ది రోజుల్లో గల్ఫ్ వెళ్లాలి. సరదాగా ఫ్రెండ్స్‌కు పార్టీ ఇవ్వడం కోసం బీచ్‌కు వెళ్లగా.. అదే అతడి చివరి రోజుగా మారింది. SI నాగబాబు వివరాల మేరకు.. దొరవారిసత్రం(M) తనయాలికి చెందిన సతీశ్, చెంచుకృష్ణ, మునిశేఖర్ రెడ్డి స్నేహితులు. సతీశ్‌కు గల్ఫ్‌లో ఉద్యోగం వచ్చింది. దీంతో సరదాగా గడిపేందుకు తూపిలిపాలెం బీచ్‌కు వెళ్లగా.. అలల తాకిడికి సతీశ్ కొట్టుకుపోయి చనిపోయాడు.
News December 22, 2024
నెల్లూరు: వైభవంగా లక్ష్మి నరసింహ స్వామి పల్లకి సేవ
నెల్లూరు కలకొండ కొండపై గల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో స్వామివారికి శనివారం పల్లకి సేవ వైభవంగా జరిగింది. స్వామివారు ఆదిలక్ష్మి, చెంచు లక్ష్మి సమేతుడై పల్లకిలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. నరసింహ నామ స్మరణతో దేవాలయం మారుమోగింది. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.