News December 11, 2024
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం రాష్ర్టంలో ఏమైంది: ఎంపీ
ఆంధ్రప్రదేశ్లో ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డ్ పథకం అమలు గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో వివరాలు కోరారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో ప్రజాపంపిణీ వ్యవస్థ కింద మంజూరు చేసిన, కేటాయించిన, వినియోగించిన నిధుల వివరాలు, రాష్ట్రంలో పథకం కింద నిర్ణయించిన లక్ష్యాలు ఏ మేరకు ఫలితాలనిచ్చాయి, రాష్ట్రంలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డులు ఎంతవరకు విజయవంతంగా నిర్వహిస్తున్నారా? అని ప్రశ్నించారు.
Similar News
News December 27, 2024
నెల్లూరులో 30 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 30వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు జరగనున్న ఈ పోటీలకు జిల్లాలో 4690 మంది అభ్యర్థులలో 3,855 మంది పురుషులు, 835 మంది స్త్రీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు.
News December 27, 2024
నెల్లూరులో రూ.95 వేల కోట్ల పెట్టుబడితో కంపెనీ ఏర్పాటు: MP
రామాయపట్నం సమీపంలో రూ.95 వేల కోట్ల పెట్టుబడితో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కంపెనీ ఏర్పాటు కానుండటం సంతోషమని MP వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. ఈ కంపెనీ ఏర్పాటు వల్ల జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. పారిశ్రామికంగా జిల్లా స్వరూపం పూర్తిగా మారిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
News December 27, 2024
నెల్లూరు VR లా కాలేజీలో రెండు వర్గాలు పరస్పర దాడులు
నెల్లూరులోని VR లా కాలేజీలో రెండు వర్గాలు పరస్పర భౌతిక దాడులకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. దీంతో నెల్లూరు లా కాలేజీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ విద్యార్థినిపై వేధింపులే ఈ ఘర్షణకు కారణం అని తెలుస్తోంది. లా విద్యార్థులపై చెన్నై నుంచి వచ్చిన రౌడీలు దాడికి పాల్పడడం గమనార్హం. ఈ ఘటనపై నెల్లూరు ఒకటో నగర పోలీస్ స్టేషన్లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు.