News January 4, 2025
వన్ హాస్పిటల్ వన్ విలేజ్లో ఫ్రీ హెల్త్ చెకప్ అందించేలా చూడాలి: కలెక్టర్

వన్ హాస్పిటల్ వన్ విలేజ్లో ఫ్రీ హెల్త్ చెకప్ అందించేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య యోజన కింద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
Similar News
News October 17, 2025
క్రాకర్స్ దుకాణాలకు అనుమతులు తప్పనిసరి: ఎస్పీ జగదీశ్

క్రాకర్స్ విక్రయలకు అనుమతులు తప్పనిసరని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి షాపులో అగ్నిమాపక పరికరాలు ఉండాలని, షాపుల మధ్య దూరం పాటించాలని తెలిపారు. షెడ్లు ప్రమాదకరంగా ఉండకూడదన్నారు. విద్యుత్ సరఫరా భద్రంగా ఉండేలా సర్టిఫైడ్ ఎలక్ట్రిషన్తో పనిచేయాలని సూచించారు.
News October 17, 2025
వైసీపీని బలోపేతం చేయడానికి కమిటీల నియామకం: అనంత వెంకటరామిరెడ్డి

వైసీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి డివిజన్ స్థాయిలో కమిటీల నియామకం చేపడుతున్నట్లు వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. గురువారం అనంతపురం నగరంలోని కోర్టు రోడ్డులోని తన క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు, వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. కమిటీల నియామకం, ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణపై అనంత దిశా నిర్దేశం చేశారు.
News October 15, 2025
పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలి: కలెక్టర్

అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పర్యాటక ప్రదేశాలను మరింతగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. భావితరాలకు మన దేశ వారసత్వం, పురాతన కట్టడాల గురించి తెలపాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు.