News July 3, 2024
వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: మంత్రి

రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సత్తుపల్లి డివిజన్లో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి కొండా సురేఖ హెలికాప్టర్లో వెళ్లారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
Similar News
News November 22, 2025
ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ

ఉర్సు గుట్ట వద్ద ఉన్న ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ శనివారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. ఆస్తుల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాల ఆన్‌లైన్ ప్రక్రియను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
News November 21, 2025
నర్సంపేట: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి ఐదు రోజుల జైలు శిక్ష

నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 19న పట్టణంలోని అంగడి సెంటర్‌లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటో నడుపుతున్న పట్టణానికి చెందిన మేకల మహేందర్ మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈరోజు మహేందర్‌ను నర్సంపేట న్యాయస్థానంలో హాజరు పరచగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీనారాయణ ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు.
News November 21, 2025
బడి బయటి పిల్లల సర్వేను క్షుణ్ణంగా నిర్వహించాలి: వరంగల్ కలెక్టర్

జిల్లాలో జరుగుతున్న బడి బయటి పిల్లల సర్వేను క్షుణ్ణంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులకు ఆదేశించారు. 6 నుంచి 14, 15 నుంచి 19 ఏళ్ల బడి బయటి పిల్లల వివరాలను ప్రబంధ్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఇటుక బట్టీలు, టెక్స్‌టైల్ పార్కుల్లో పనిచేసే కుటుంబాల పిల్లలకు పని ప్రదేశంలోనే పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


