News November 11, 2024
వయనాడు ఎంపీ ఉప ఎన్నికల బరిలో నగరవాసి..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించిన కేరళ వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికల్లో హైదరాబాద్ అంబర్‌పేట్‌కు చెందిన జాతీయ జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నాగేశ్వర్ రావు పోటీ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ తనకు ‘గ్రీన్ చిల్లి’ గుర్తు కేటాయించిందని ఆయన తెలిపారు. త్వరలో ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులు బరిలో ఉంటారని తెలిపారు.
Similar News
News December 9, 2025
తెలంగాణలో సల్మాన్ ఖాన్ వెంచర్స్

సల్మాన్ ఖాన్ వెంచర్స్ తెలంగాణలో రూ.10,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, ఫిల్మ్ స్టూడియోను అభివృద్ధి చేయనుంది. తెలంగాణ రైజింగ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రకటనలలో ఇది ఒకటి. ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియోను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను ఆవిష్కరించడం విశేషం. ఈ ప్రాజెక్ట్ లగ్జరీ హాస్పిటాలిటీ, అనుభవపూర్వక విశ్రాంతి, క్రీడా మౌలిక సదుపాయాలు, పూర్తి స్థాయి ఉత్పత్తి పర్యావరణ వ్యవస్థను మిళితం చేస్తుంది.
News December 9, 2025
HYD: సిటీలో నీటిని తోడేస్తున్నారు!

మహానగరంలో భూగర్భజలాలను యథేచ్ఛగా వాడేస్తున్నారు. వాడాల్సిన నీటి కంటే ఎక్కువ తోడుతూ భూగర్భాన్ని ఖాళీ చేస్తున్నారు. భూమిలో ఇంకే నీటి కంటే వాడేనీరే అధికంగా ఉంటోంది. సరూర్‌నగర్, శేరిలింగంపల్లి, చార్మినార్, గోల్కొండ, అంబర్‌పేట, ఖైరతాబాద్, అసిఫ్‌నగర్, హిమాయత్‌నగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో వాడకం మరీ ఎక్కువగా ఉందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తేల్చింది.
News December 9, 2025
HYD: ఇపుడు 69.. తర్వాత 152.. ఫ్యూచర్లో 400 KM!

గ్రేటర్ హైదరాబాద్‌లో మున్సిపాలిటీల విలీనం తరువాత విస్తీర్ణం భారీగా పెరిగింది. దీంతో రవాణా అవసరాలు కూడా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహానగరంలో మెట్రో రైలును కూడా మహానగర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 69 కిలోమీటర్ల నెట్ వర్క్ ఉన్న మెట్రో రెండో దశలో మరో 152 KM పెరిగే అవకాశముంది. 2047 నాటికి మెట్రోను 400 KM పెంచి 623 KMకు విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.


