News November 12, 2024

వయా జహీరాబాద్.. ముంబై- HYD బుల్లెట్ ట్రైన్

image

ముంబై- హైదరాబాద్ వయా జహీరాబాద్ బుల్లెట్ రైల్వే ప్రాజెక్ట్ కోసం డీపీఆర్(సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను సిద్ధం చేసి రైల్వే మంత్రిత్వశాఖకు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును 2051 వరకు పూర్తి చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. కొత్త లైన్ నిర్మాణానికి అధికారులు పలు ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు.

Similar News

News November 26, 2025

మెదక్: ఏడుపాయల టెండర్ ఆదాయం రూ.3.75 లక్షలు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం కార్యాలయంలో బుధవారం మహా శివరాత్రి జాతర సీల్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించారు. ఈఓ చంద్రశేఖర్, మెదక్ జిల్లా దేవాదాయ శాఖ పరివేక్షకుడు వెంకట రమణ సమక్షంలో వేలం జరిగింది. జాతరలో కొబ్బరి ముక్కలు పోగు హక్కు రూ.3.75 లక్షలకు నాగ్సాన్‌పల్లి పి.మల్లేశం దక్కించుకున్నారు. మిగతా టెండర్లకు సరైన పాటలు రాక వాయిదా వేసినట్టు అధికారులు తెలిపారు.

News November 26, 2025

MDK: ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: SEC

image

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో వీసీ నిర్వహించి, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. టి-పోల్‌లో రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు అప్‌డేట్ చేయాలని, ఫిర్యాదులు మూడు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. నామినేషన్లు నవంబర్ 27–29 స్వీకరణపై మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పారు.

News November 26, 2025

మెదక్: లోకల్ ఫైట్.. మన ఊరిలో ఎప్పుడెప్పుడంటే

image

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వాహణకు షెడ్యూల్ విడుదలైంది.
మెదటి విడత(Dec 11న)లో అల్లాదురం, రేగోడ్, టేక్మాల్, హవేళిఘనపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట.
రెండో దఫా(14న)లో తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగ్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంరంపేట, మెదక్.
మూడో విడత(17న)లో నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కౌల్చారం, శివంపేట, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.