News March 1, 2025
వరంగల్‌కు ఎయిర్‌పోర్టు.. రివ్వున ఎగరనున్న విమానాలు

మామునూర్ ఎయిర్ పోర్టుకు కేంద్రం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓరుగల్లు ప్రజల ఏళ్లనాటి ఆకాంక్ష నెరవేరబోతోంది. ఇప్పటికే 696 ఎకరాల భూమిని సేకరించగా.. మరో 253 ఎకరాల భూమిని గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల రైతుల నుంచి సేకరిస్తున్నారు. దీనికోసం రూ.205 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో విమానాలు నడిపేందుకు ఇప్పుడున్న 1.8 కి.మీ రన్‌వేను 3.9కి.మీలకు పెంచాల్సి ఉంది. మీ కామెంట్
Similar News
News November 28, 2025
KMM: ‘BRSతో CPM పొత్తు..!’

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు చోట్ల BRS బలపర్చిన అభ్యర్థులకు CPM నేతలు మద్దతు తెలుపుతున్నారు. శుక్రవారం ముదిగొండలో BRS, CPM మండల స్థాయి ఎన్నికల సమావేశాన్ని CPM మండల కార్యదర్శి పురుషోత్తం, BRS మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి నిర్వహించి స్థానికంగా తమ పార్టీలు పొత్తులో ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు భద్రాచలంలో BRS బలపర్చిన సర్పంచ్ అభ్యర్థికి CPM నేతలు మద్దతు తెలిపారు.
News November 28, 2025
సూర్యాపేట: ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం

మోతె మండలం రవికుంట తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి భూక్యా ఉప్పయ్యను సర్పంచ్‌గా ఎన్నుకున్నాయి. మోతె మండలంలో సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన గ్రామ అభివృద్ధికి రూ.20 లక్షల నిధులు ప్రకటించారు.
News November 28, 2025
ఐఐఎం విశాఖలో ఉద్యోగాలు

ఐఐఎం విశాఖపట్నం కాంట్రాక్ట్ ప్రాతిపదికన రీసెర్చ్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రీసెర్చ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.30వేలు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.iimv.ac.in


