News February 19, 2025
వరంగల్కు నూతన మూల్యాంకన క్యాంపు

వరంగల్ జిల్లా కేంద్రంగా ఇంటర్ నూతన మూల్యాంకన క్యాంపు మంజూరు చేసినట్లు డీఐఈవో శ్రీధర్ సుమన్ తెలిపారు. గతంలో హన్మకొండ కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన జనగామ, హన్మకొండ, భూపాలపల్లి, వరంగల్, ములుగు, మహబూబాబాద్ 6 జిల్లాల ఇంటర్ సిబ్బంది మూల్యాంకన ప్రక్రియ కొనసాగింది. లాల్ బహదూర్ జూనియర్ కళాశాలలో తరగతి గదులు, కార్యాలయం, సౌకర్యాలను పరిశీలించిన పిమ్మట నూతన క్యాంపు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Similar News
News November 22, 2025
కొత్త లేబర్ కోడ్లు.. గొప్ప సంస్కరణల్లో ఒకటి: సీఎం

<<18351140>>కొత్త లేబర్ కోడ్లు<<>> భారత అభివృద్ధికి మైలురాళ్లని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత అత్యంత కీలకమార్పులుగా లేబర్ కోడ్లు నిలుస్తాయన్నారు. ‘వీటితో కార్మికులకు ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాల హామీ ఉంటుంది. గిగ్ వర్కర్లకు రక్షణ, మహిళలకు మరింత సమానత్వం లభిస్తుంది. ప్రపంచస్థాయి ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే సంస్కరణ ఇది. వీటిని అందించిన PMకు అభినందనలు’ అని ట్వీట్ చేశారు.
News November 22, 2025
చెత్త రికార్డు.. టెస్టు చరిత్రలోనే తొలిసారి

యాషెస్ తొలి టెస్టులో చెత్త రికార్డు నమోదైంది. వరుసగా మూడు ఇన్నింగ్సుల్లో ఒక్క రన్ చేయకుండా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యింది. టెస్టు చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి. ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్సులో జాక్ క్రాలే, AUS తొలి ఇన్నింగ్స్లో వెదరాల్డ్ డకౌటయ్యారు. తొలి ఇన్నింగ్స్లో ENG: 172/10, AUS: 132/10 రన్స్ చేశాయి. రెండో ఇన్నింగ్స్లో 16 ఓవర్లకు ENG 104 పరుగుల ఆధిక్యం(64/1)లో కొనసాగుతోంది.
News November 22, 2025
లొంగుబాటు.. చొక్కారావు, రాజిరెడ్డిలు ఉంటారా..?

ఉమ్మడి కరీంనగర్కు చెందిన మావోయిస్టు పార్టీ కీలక నేతలు బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ ఇవాళ రాష్ట్ర DGP శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోతున్నట్లు తెలుస్తోంది. చొక్కారావు దండకారణ్య కమిటీ మెంబర్గా విధులు నిర్వర్తిస్తుండగా, రాజిరెడ్డి రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరితోపాటు మరో 37మంది మావోలు వనం నుంచి జనంలోకి వచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.


