News July 4, 2024
వరంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి
హైదరాబాదుకు దీటుగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హన్మకొండలో ఈరోజు ఆయన పర్యటించి కొత్త ఐటీ కంపెనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతమని హామీ ఇచ్చారు. త్వరలోనే ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీల భర్తీకి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
Similar News
News October 8, 2024
HNK: ‘పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది’
తల్లిదండ్రులు లేకపోయినా నిరుత్సాహ పడలేదు. పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన బొల్లెపల్లి శ్రీజకు తల్లిదండ్రులు లేరు. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పోటీ పరీక్షలు రాసి మల్టీ జోనల్ 22వ ర్యాంక్ సాధించింది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఈవోగా నియామక పత్రం అందుకుంది.
News October 7, 2024
వరంగల్: ఈనెల 9న జాబ్ మేళా
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 9న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి మల్లయ్య తెలిపారు. ములుగు రోడ్డులోని ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా ఉంటుందన్నారు. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 7, 2024
ఆత్మీయులను కోల్పోవడానికి మించిన దుఃఖం లేదు: సీతక్క
ఆత్మీయులను కోల్పోవడానికి మించిన దుఃఖం లేదని మంత్రి సీతక్క ట్వీట్ చేశారు. ఇటీవల మరణించిన కాంగ్రెస్ నాయకులు నూకల నరేశ్ రెడ్డి, చుక్కల ఉదయ చందర్ కుటుంబాలను నేడు పరామర్శించానని, వారి కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో అన్ని విధాల అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి సీతక్క చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.