News March 8, 2025
వరంగల్ను శాసిస్తున్న మహిళా శక్తి

ఓరుగల్లును మరోసారి మహిళా శక్తి శాసిస్తోంది. ఒకప్పుడు రుద్రమదేవి పరిపాలనలో గొప్ప శోభను అందుకున్న వరంగల్ రాజ్యం, నేడు అనేక కీలక పదవుల్లో మహిళా నేతలతో మరో చరిత్ర సృష్టిస్తోంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, వరంగల్ ప్రాంతాన్ని నడిపిస్తున్న మహిళా నేతల కృషిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కీలక హోదాల్లో మహిళా నేతలు ప్రభుత్వ పరిపాలన నుంచి రాజకీయాల వరకు భాగమవుతున్నారు. HAPPY WOMEN’S DAY.
Similar News
News September 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 19, 2025
చింతకుంటలో ఎరువుల పంపిణీని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్

దువ్వూరు మండలం చింతకుంటలోని రైతు సేవా కేంద్రంలో గురువారం జరిగిన యూరియా పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి చంద్ర నాయక్ పరిశీలించారు. రైతులు యూరియా వినియోగాన్ని క్రమేనా తగ్గించాలని, దీని స్థానంలో నానో యూనియన్ వాడాలని సూచించారు. ఎరువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News September 19, 2025
ఈనెల 22 నుంచి చౌడేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

నందవరంలో ఈనెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీ చౌడేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల భాగంలో చౌడేశ్వరి దేవి అలంకరణ వివరాలు ఇలా..
☞ 22న శైలపుత్ర అలంకరణ ☞ 23న బ్రహ్మచారిణి అలంకరణ
☞ 24న చంద్రఘాట్ ☞ 25న కుష్మాండ
☞ 26 స్కందమాత ☞ 27న కాత్యాయనీ
☞ 28న కాళరాత్రి ☞ 29న మహాగౌరి
☞ 30న మహాదుర్గ ☞ అక్టోబర్ 1న సిద్ధి ధాత్రి
☞ 2న విజయ చౌడేశ్వరి దేవి అలంకరణ