News March 7, 2025
వరంగల్:భద్రకాళి అమ్మవారి నేటి ప్రత్యేక రూపం

తెలంగాణ ఇంద్రకీలాద్రి, ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని శుక్రవారం ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల పూలతో దండలు అల్లి మాలగా అమ్మవారికి ధరించారు. మాస శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు చేస్తున్నట్లు ఆలయ ఈవో భారతి తెలిపారు.
Similar News
News November 28, 2025
ప్రకాశం జిల్లా వాసులకు గుడ్ న్యూస్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తంగా శుక్రవారం పామూరు ఈటీఎన్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారావు తెలిపారు. 10, ఇంటర్, డిగ్రీ, ఆపై చదివిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. నెలకి రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం వస్తుందన్నారు. పూర్తి వివరాలకు. 99888 53335 నంబరును సంప్రదించాలన్నారు.
News November 28, 2025
చెక్క దువ్వెన వాడుతున్నారా?

జుట్టు ఆరోగ్యం కోసం ప్రస్తుతం చాలామంది చెక్క దువ్వెన వాడుతున్నారు. కానీ దీన్ని క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగిపోతుంది. గోరువెచ్చని నీటిలో డిష్‌వాష్ లిక్విడ్/ షాంపూ, కొబ్బరి, ఆలివ్ నూనెలను కలపాలి. దువ్వెనను ఈ మిశ్రమంలో 2 నిమిషాలు ఉంచి బ్రష్‌తో రుద్దాలి. తర్వాత ఎండలో ఆరబెడితే సరిపోతుంది. నీటితో వద్దు అనుకుంటే నూనెను దువ్వెన మొత్తం పట్టించి ఓ అరగంటయ్యాక బ్రష్‌తో దువ్వెన పళ్లను శుభ్రం చేయాలి.
News November 28, 2025
ఖమ్మంకు ఎన్నికల పరిశీలకులు

గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు ఖర్తడే కాళిచరణ్ సుధామరావు (ఐఏఎస్) గురువారం ఖమ్మం జిల్లాకు విచ్చేశారు. ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి స్వాగతం పలికారు. అనంతరం పరిశీలకులు, కలెక్టర్‌తో కలిసి సంబంధిత అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని పరిశీలకులు అధికారులను ఆదేశించారు.


