News March 26, 2025
వరంగల్:రీవాల్యుయేషన్‌కు 21,920 దరఖాస్తులు!

ఇటీవల కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. 1st సెమిస్టర్లో 21.9%, 3rd సెమిస్టర్లో 28.9%, 5th సెమిస్టర్లో 40.7% మంది విద్యార్థులు ఉత్తీర్ణత అయ్యారు. ఆయా సెమిస్టర్లలో ఫెయిల్ అయిన వారు రీవాల్యుయేషన్లో దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 21,920 దరఖాస్తులు వచ్చాయని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. రీవాల్యుయేషన్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది.
Similar News
News January 8, 2026
Gen Z కుర్రాడి ఆర్టికల్‌కు భయపడ్డ పాక్.. ఇంతకీ ఏం రాశాడు?

పాక్ ఆర్మీని ఉద్దేశిస్తూ USలో Ph.D చేస్తున్న జోరైన్ నిజామనీ రాసిన ‘It Is Over’ అనే ఆర్టికల్ ఇప్పుడు ఆ దేశంలో సంచలనంగా మారింది. దేశభక్తిని బలవంతంగా రుద్దలేమని, సమాన అవకాశాలు కల్పించినప్పుడే అది సాధ్యమని ఆయన కుండబద్దలు కొట్టారు. పాతతరం నాయకుల పప్పులు ప్రస్తుత Gen-Z దగ్గర ఉడకవని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌లో రాశారు. అయితే సైన్యం ఒత్తిడితో ఈ వ్యాసాన్ని తొలగించటంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది.
News January 8, 2026
TISSలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(<
News January 8, 2026
నాకు మంచి పేరు వస్తుందనే ఆపేశారు: జగన్

AP: తనకు మంచి పేరు వస్తుందనే రాయలసీమ ఎత్తిపోతలను అర్ధాంతరంగా ఆపేశారని జగన్ విమర్శించారు. ‘శ్రీశైలం నుంచి 800అడుగుల్లోనే AP 3TMCల నీళ్లు తీసుకునేలా ప్రాజెక్ట్ చేపట్టాం. రూ.వెయ్యి కోట్లు వెచ్చించి పనులు స్పీడప్ చేశాం. ప్రాజెక్ట్ పూర్తయితే నాకు మంచి పేరు వస్తుందని TGలో TDP కార్యకర్తలతో CBN కేసులు వేయించారు. అయినా పనులు కొనసాగించాం. ప్రభుత్వం మారగానే ఎత్తిపోతలకు చంద్రగ్రహణం పట్టింది’ అని మండిపడ్డారు.


