News March 22, 2024
వరంగల్‌లో క్రికెట్ క్లబ్

వరంగల్ జిల్లా యువతకు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే వరంగల్‌లో క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. హెచ్‌సీఏ నిర్ణయంపై వరంగల్ జిల్లా యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 15, 2025
WGL: ఎక్కడ చూసినా అదే చర్చ..!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా WGL-KMM-NLG టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ MLC ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్, సంగంరెడ్డి సుందర్ రాజ్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
News February 15, 2025
వరంగల్: ఎన్నికలకు రెడీ.. వాయిదాపై అధికారుల నిట్టూర్పు!

మూడు రోజుల ముందు వరకు వరంగల్ జిల్లాలోని అధికార యంత్రాంగం స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై తలమునకలయ్యారు. ఇంతలోనే BC సర్వే పూర్తయ్యాకే ఎన్నికల్లోకి వెళ్తామని మంత్రులు ప్రకటించడంతో అధికారులు నిరుత్సాహానికి గురయ్యారు. WGL జిల్లాలో 323 పంచాయతీలు, 130 MPTC, 11 ZPTC స్థానాలు ఉన్నాయి. వాటి ఎన్నికల కోసం ఇప్పటికే RO, AROలకు ట్రైనింగ్, సామగ్రి, పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితా సిద్ధం చేశారు.
News February 15, 2025
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిపై నజర్ పెట్టండి: సీపీ

ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు నజర్ పెట్టాలని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. ట్రిపుల్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ చేసేవారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.ముఖ్యంగా మందుబాబులు తాగి వాహనాలు నడపకుండా ట్రై సిటీ పరిధిలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు.