News August 4, 2024
వరంగల్లో దోస్తానా అంటే ప్రాణం!

దోస్తానా అంటే ఓరుగల్లు వాసులు జాన్ ఇస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు నగరంలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్వెల్ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? Happy Friendship Day
Similar News
News October 15, 2025
గౌరీ కేదారేశ్వర నోములు 21నే: ప్రధానార్చకుడు

పరమపవిత్రమైన గౌరీ కేదారీశ్వర నోములను ఈనెల 21 మంగళవారం రోజున ఆచరించాలని భద్రకాళి దేవస్థానం ప్రధానార్చకుడు భద్రకాళి శేషు తెలిపారు. ఈనెల 20న నరక చతుర్దశి సందర్భంగా సూర్యోదయానికి ముందే స్నానాలు చేసి, హారతులు తీసుకోవాలన్నారు. సూర్యోదయానికి ముందు తైలం రాసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చెప్పారు.
News October 15, 2025
రేపు ములుగు రోడ్డులో జాబ్ మేళా..!

నిరుద్యోగ యువతీయువకులకు ఈనెల 16న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా ఉపాధి కల్పన అధికారి సాత్విక తెలిపారు. ఆల్ మార్క్ ఫైనాన్సియల్ సర్వీసెస్లో రికవరీ ఏజెంట్, టెలీకాలర్ ఉద్యోగాల కోసం మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగలవారు తమ విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ములుగు రోడ్డులోని ఐటీఐ ప్రాంగణంలో గల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జరగనున్న జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు.
News October 14, 2025
వరంగల్: అదే పరిస్థితి.. మద్యం టెండర్లకు విముఖత..!

వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న మద్యం షాపులకు టెండర్లు వేసేందుకు వ్యాపారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 15 మద్యం షాపులకు గాను 31 మాత్రమే దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఒక్కో మద్యం షాపుపై ఇప్పటివరకు కనీసం పదికి పైగా కూడా దరఖాస్తులు రాలేదు. దీంతో ఎక్సైజ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.