News April 5, 2025
వరంగల్లో సన్నబియ్యం పంపిణీ.. BJP, కాంగ్రెస్ వార్

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్ సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బియ్యం మేమిస్తున్నామంటే మేమిస్తున్నామని ఓరుగల్లు BJP, కాంగ్రెస్ నాయకుల మధ్య వార్ నెలకొంది. కేంద్రం 5KGలు, రాష్ట్రప్రభుత్వం 1KG మాత్రమే ఇస్తుందని BJPనేతలు అంటుంటే.. మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటో ఎందుకు పెట్టలేదని BJP నాయకులు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News December 4, 2025
దుగ్గిరాలలో క్వింటాల్ పసుపు ధర ఎంతంటే.!

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాల్ పసుపు రూ.12,500 గరిష్ఠ ధర పలికింది. యార్డులో గురువారం నిర్వహించిన వేలంలో పసుపు కొమ్ముల ధర రూ.8,500 నుంచి రూ.12,500 పలకగా కాయ రకం పసుపు ధర రూ. 8,550 నుంచి రూ.12,500 వరకు పలికినట్లు అధికారులు తెలిపారు. రైతులు యార్డుకు తెచ్చిన పసుపు పంటలో 684 బస్తాలను వ్యాపారులకు విక్రయించారు.
News December 4, 2025
కల్వకుర్తి: కొనసాగుతున్న ఏకగ్రీవాల జోరు

కల్వకుర్తి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏకగ్రీవాల జోరు కొనసాగుతుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా నియోజకవర్గంలోని రెండు మండలాలలో ఆరు గ్రామాల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వెల్దండ మండలంలోని బండోని పల్లి, చౌదరిపల్లి, కేస్లీ తాండ, కల్వకుర్తి మండలంలోని రఘుపతిపేట, జీడిపల్లి తండా, వెంకటాపూర్ తండాల పంచాయతీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవంతో స్థానిక నాయకులు పట్టు నిలుపుకున్నారు.
News December 4, 2025
విశాఖ: రక్షణలేని ఉక్కు నిర్వాసితుల స్థలాలు

ఉక్కు పరిశ్రమ నిర్వాసితుల కోసం కేటాయించిన స్థలాల్లో కబ్జాదారులు చొరబడుతున్నారు. ఇటీవల గాజువాకలోని వికాస్ నగర్ ITI రోడ్డు వద్ద సర్వే నంబర్ 153 భూమిలో రాత్రికి రాత్రే 18 షెడ్లు నిర్మించేందుకు ప్రయత్నించగా.. అధికారులు అడ్డుకున్నారు. బీసీ రోడ్డు శివాలయం దగ్గర ఆరేళ్లుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చివరకు అధికారులు నిర్మాణాలను తొలగించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.


