News April 9, 2025
వరంగల్లో CONGRESS VS BRS

ఉమ్మడి వరంగల్ జిల్లాలో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు BRS నేతలు KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRS నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?
Similar News
News September 17, 2025
వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిపాలన భవనం ప్రాంగణంలో పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్ రావు, సురేశ్ కుమార్, ఏసీపీలు, ఆర్ఐలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో పాటు వివిధ విభాగాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
News September 17, 2025
వరంగల్ జిల్లాలో వర్షపాతం వివరాలు

వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం తేలికపాటి వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం 8:30 నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు మొత్తం 128.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఖిల్లా వరంగల్ మండలంలో అత్యధికంగా 27.8 మి.మీ వర్షం పడగా, గీసుగొండ 18, వరంగల్ 15.8 వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 9.9 మి.మీగా నమోదైంది.
News September 17, 2025
వరంగల్: ఐక్యతతోనే విజయం సాధ్యం

ఐక్యతతోనే విజయం సాధ్యం అనే నానుడిని స్ఫూర్తిగా తీసుకుంటూ తెలంగాణ గడ్డ ఎల్లప్పుడూ పోరాటపటిమను ప్రదర్శిస్తోందని వరంగల్ పోలీసులు పేర్కొన్నారు. ఐక్యతతో ముందుకు సాగితేనే సమాజం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్న సందేశాన్ని కొనసాగిస్తూ విజయపథంలో ముందుకు సాగుదాం అంటూ తమ అధికారిక X ఖాతా ద్వారా పిలుపునిచ్చారు.