News April 9, 2025
వరంగల్‌లో CONGRESS VS BRS

ఉమ్మడి వరంగల్ జిల్లాలో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు BRS నేతలు KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRS నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?
Similar News
News April 20, 2025
సిద్దిపేట: తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య

తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయపోలు మండలంలో జరిగింది. ఎస్ఐ రఘుపతి వివరాల ప్రకారం.. మండలంలోని మంతూరుకు చెందిన ప్రిస్కిల్లా(25) మూడేళ్ల నుంచి మానసిక స్థితి బాగోలేదు. ఈ క్రమంలో మాత్రలు వేసుకోమంటే నిరాకరించడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై 17న పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 20, 2025
VIRAL: ఈ 500 తీసుకుని పాస్ చేయండి..!

కర్ణాటక చిక్కోడిలో పదో తరగతి జవాబు పత్రాల్లో సమాధానాలకు బదులు కరెన్సీ నోట్లు, కాళ్ల బేరాలు దర్శనమిచ్చాయి. తమను ఎలాగైనా పాస్ చేయాలంటూ కొందరు రూ.500 నోట్లు పెట్టారు. పాస్ చేస్తే ఇంకా డబ్బిస్తామని ఆశ చూపించారు. ఇంకొందరైతే ‘నా ప్రేమ మీరు వేసే మార్కుల మీదే ఆధారపడి ఉంది’ అని రాశారు. మరికొంత మంది ‘మీరు పాస్ చేయకపోతే కాలేజీకి వెళ్లలేను.. ప్లీజ్ పాస్ చేయండి’ అని వేడుకున్నారు.
News April 20, 2025
తిరుపతి: 22వ తేదీన జాబ్ మేళా

ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరియర్ సెంటర్ (MCC)AY 22వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. దాదాపు 14 కంపెనీల ప్రతినిధుల హాజరవుతారని తెలిపారు. పదోతరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 800 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.