News March 8, 2025
వరంగల్‌లో KCR భారీ బహిరంగ సభ

BRS పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో మాజీ సీఎం KCR శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌లో ఆయన కీలక ప్రకటన చేశారు. వరంగల్ గడ్డపై లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులకు సూచనలు చేయగా వారు గ్రౌండ్‌ను పరిశీలించారు.
Similar News
News November 14, 2025
కేయూ హాస్టళ్ల బిల్లుల చెల్లింపుపై విచారణ కమిటీ

కేయూలో హాస్టళ్ల ఖర్చులు, మెస్ బిల్లులు, టెండర్లు, చెల్లింపులపై అవకతవకల ఆరోపణలను పరిశీలించేందుకు నలుగురితో విచారణ కమిటీని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం నియమించారు. ప్రొఫెసర్ ఎన్. ప్రసాద్‌ను ఛైర్మన్‌గా, ప్రొఫెసర్ ఇస్తారి, ప్రొఫెసర్ రాజ్‌కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ రామును సభ్యులుగా నియమించారు. 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని, స్టూడెంట్స్ డిమాండ్‌పై విడిగా మరో కమిటీ ఏర్పాటుకు ఆలోచిస్తున్నారు.
News November 14, 2025
‘సూర్యఘర్’ పథకంలో నంచర్ల మోడల్ గ్రామం

సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం అమలుచేస్తున్న ‘PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ కింద మహమ్మదాబాద్(M)లోని నంచర్ల మోడల్ గ్రామంగా ఎంపికైంది. జిల్లాస్థాయి కమిటీ 6 నెలలపాటు జరిపిన పోటీలో నంచర్ల అత్యధిక సౌర విద్యుత్ వినియోగంతో నిలిచింది. ఈ పథకం కింద గ్రామంలోని GOVT ఆఫీస్లపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటుచేసి, బిల్లుల భారాన్ని తగ్గిస్తారు. అధికారులు త్వరలోనే సర్వే పూర్తిచేసి DPR తయారుచేస్తామన్నారు.
News November 14, 2025
కరీంనగర్: రేపు SPECIAL లోక్ అదాలత్

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రేపు ప్రత్యేక లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కే.రాణి తెలిపారు. ఈ అదాలత్‌లో క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటార్ ప్రమాదాల పరిహారం వంటి కేసులు ఇరుపక్షాల రాజీతో పరిష్కారమవుతాయని చెప్పారు. రాజీపడదగిన వారు సంబంధిత పోలీసు వారిని సంప్రదించాలని ఆమె సూచించారు.


