News March 8, 2025
వరంగల్‌లో KCR భారీ బహిరంగ సభ

BRS పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో మాజీ సీఎం KCR శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌లో ఆయన కీలక ప్రకటన చేశారు. వరంగల్ గడ్డపై లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులకు సూచనలు చేయగా వారు గ్రౌండ్‌ను పరిశీలించారు.
Similar News
News January 25, 2026
వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారికి ఆదివారం రథసప్తమి సందర్భంగా ప్రత్యేక అలంకరణ చేశారు. అర్చకులు తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి పంచామృతాలతో విశేషమైన అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు.
News January 25, 2026
బడ్జెట్ సమావేశాల్లో జమిలి, అమరావతి బిల్లులు!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ‘జమిలి ఎన్నికల’ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే JPC నివేదిక సిద్ధమైంది. అమరావతిని AP రాజధానిగా చట్టబద్ధం చేసే బిల్లుతో పాటు, ‘పూర్వోదయ’ పథకం కింద రాష్ట్రానికి భారీ నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఆదాయ పన్ను సరళీకరణ, వక్ఫ్ బోర్డు సవరణలు, ‘వికసిత్ భారత్ శిక్షా అధీక్షణ్ బిల్లు’ కూడా ఈ సమావేశాల్లో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.
News January 25, 2026
‘అనకాపల్లి జిల్లాలో రూ.37 కోట్లతో అభివృద్ధి పనులు’

అనకాపల్లి జిల్లాలో రూ.37 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి తెలిపారు. శనివారం మునగపాక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 2025-26 సంవత్సరంలో జిల్లాలో 24 మండలాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.37.66 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. ఇప్పటివరకు అభివృద్ధి పనులకు రూ.33.48 కోట్లు ఖర్చు చేశామన్నారు.


