News March 8, 2025
వరంగల్‌లో KCR భారీ బహిరంగ సభ

BRS పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో మాజీ సీఎం KCR శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌లో ఆయన కీలక ప్రకటన చేశారు. వరంగల్ గడ్డపై లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులకు సూచనలు చేయగా వారు గ్రౌండ్‌ను పరిశీలించారు.
Similar News
News November 5, 2025
VKB: మినరల్ వాటర్ మాయజాలం.!

మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటర్ ప్లాంట్ యజమాన్యాలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ నిబంధనలు పాటించకుండా మాయజాలం చేస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్న మినరల్ దందాపై అధికారుల పర్యవేక్షణ కరువైందనే విమర్శలు వెలువడుతున్నాయి. అనుమతులు లేకుండానే మినరల్ వాటర్ పేరుతో జనరల్ వాటర్‌ను ప్రజలకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి.
News November 5, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టులో 11, 929 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

కామారెడ్డి-నిజామాబాద్ జిల్లా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే నిజాంసాగర్ ప్రాజెక్టులో ఈ ఖరీఫ్‌లో 70 రోజులు దాటినా వరద కొనసాగుతోంది. మంగళవారం 11,929 క్యూసెక్కుల వరద రాగా, 2 గేట్లు ఎత్తి 8,096 క్యూసెక్కులను దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా, ప్రస్తుతం 1,404.99 అడుగుల వద్ద నీటిమట్టాన్ని నిర్వహిస్తున్నారు.
News November 5, 2025
విమాన ప్రయాణికులకు శుభవార్త

విమాన టికెట్ల రద్దు అంశంపై ప్రయాణికులకు DGCA గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్లు బుక్ చేసుకున్న 48 గంటల్లోపు ఎలాంటి ఛార్జీ లేకుండా రద్దు చేసుకోవడం/ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. క్రెడిట్ కార్డు ద్వారా అయితే 7 రోజుల్లో, ట్రావెల్ ఏజెంట్/పోర్టల్ ద్వారా బుక్ చేసుకుంటే 21 పనిదినాల్లో రిఫండ్ అందుతుంది. దేశీయ విమానాల్లో ప్రయాణానికి 5D, ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లలో 15D లోపు ఈ సౌకర్యం వర్తించదు.


