News March 8, 2025
వరంగల్‌లో KCR భారీ బహిరంగ సభ

BRS పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో మాజీ సీఎం KCR శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌లో ఆయన కీలక ప్రకటన చేశారు. వరంగల్ గడ్డపై లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులకు సూచనలు చేయగా వారు గ్రౌండ్‌ను పరిశీలించారు.
Similar News
News February 17, 2026
VZM: రైల్వే పోలీసుల ఫోన్ నంబర్లు మారాయి..

విజయనగరం రైల్వే పోలీసుల (GRP) ఫోన్ నంబర్లు మారాయి. టెలికాం సంస్థతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి కొత్త నంబర్ల కేటాయింపు జరిగింది. అందులో భాగంగా ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ హోదాల్లో ఉన్న వారికి మాత్రమే నంబర్లు వినియోగించుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా విజయనగరం రైల్వే ఎస్‌ఐ 9247585742, పలస ఎస్‌ఐ 9247585743, ఆమదాలవలస ఎస్‌ఐ 9247585744 నంబర్లలో అందుబాటులో ఉంటారు.
News February 17, 2026
అజిత్ పవార్ మృతి.. కీలక పరిణామం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ <<19106331>>మృతి కేసులో<<>> కీలక పరిణామం చోటుచేసుకుంది. విమాన ప్రమాదంపై సీబీఐ విచారణ చేయాలని ఆయన భార్య, Dy.CM సునేత్రా పవార్ డిమాండ్ చేశారు. NCP లీడర్లు, పెద్ద కుమారుడు పార్థ్‌తో ఆమె సీఎం ఫడణవీస్‌ను కలిసి ఈ మేరకు లేఖను అందజేశారు. ‘ఈ విషయంపై కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. కేంద్ర సంస్థతో దర్యాప్తు చేయిస్తామన్నారు’ అని NCP నేత సునీల్ వెల్లడించారు.
News February 17, 2026
రేపు సెలవు కానీ పరీక్షలు యథాతథం: ADB కలెక్టర్

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 18న జిల్లాలో స్థానిక సెలవు ప్రకటించబడినప్పటికీ, అదే రోజున నిర్వహించాల్సిన ఎస్సెస్సీ ప్రీ–ఫైనల్ పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేయబడవన్నారు. జిల్లాలోని MEOలు, HMలు, SOలు, TGMS ప్రిన్సిపల్స్ పరీక్షలు నిర్ణీత టైమ్‌టేబుల్ ప్రకారం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


