News April 14, 2024

వరంగల్‌లో SUMMER CRICKET

image

క్రికెట్‌ ప్లేయర్లకు HYD క్రికెట్ అసోసియేషన్ శుభవార్త చెప్పింది. HCA ఆధ్వర్యంలో ఈనెల 20న జిల్లాల వారిగా సమ్మర్ క్యాంప్‌ మొదలుపెడుతామని ప్రెసిడెంట్ జగన్‌ మోహన్‌‌‌రావు తెలిపారు. ఉచితంగా‌నే ఈ క్యాంప్‌ కొనసాగిస్తామని‌ స్పష్టం చేశారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందన్నారు.
కేంద్రాల వివ‌రాలు:
వ‌రంగ‌ల్‌: 98495 70979,
ములుగు: 90301 30727,
మ‌హ‌బూబాబాద్‌: 98664 79666,
భూపాల‌ప‌ల్లి: 88978 05683.

Similar News

News April 21, 2025

నాడు ‘పాకాల’.. నేడు ‘నర్సంపేట’

image

ప్రస్తుత నర్సంపేట నియోజకవర్గం 1956లో ఏర్పడింది. అంతకుముందు హైదరాబాద్ సంస్థానంలో ఈ ప్రాంతాన్ని పాకాల నియోజకవర్గంగా పేర్కొనేవారు. మొదట్లో పాకాల తాలూకాగా తర్వాత నర్సంపేటగా రూపాంతరం చెందింది. 1952లో పాకాల ఎమ్మెల్యేగా ఏ.గోపాలరావు గెలుపొందారు. 1957లో నర్సంపేట ఎమ్మెల్యేగా కనకరత్నమ్మ గెలిచారు. దీంతో నర్సంపేట అంటే పాకాల.. పాకాల అంటే నర్సంపేటగా ప్రత్యేక గుర్తింపు ఉంది.

News April 21, 2025

వరంగల్: Wow.. ఆరు తరాల సయింపు వంశీయుల ఆత్మీయ సమ్మేళనం

image

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం అనంతారానికి చెందిన సయింపు కుటుంబానికి చెందిన ఆరు తరాల రక్త సంబంధీకులు ఇటీవల ఒక ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఒకేచోట కలుసుకున్నారు. చదువు, ఉద్యోగ అవసరాల కారణంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వీరు.. కుటుంబ సమేతంగా పాల్గొని, ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించి ఆనందాన్ని పంచుకున్నారు. ఆత్మీయత, బంధుత్వం మరింత బలపడేలా ఈ సమావేశం కలిసొచ్చింది.

News April 21, 2025

పంట పొలాలు, చారిత్రక ఆనవాళ్లు.. ఇదీ దుగ్గొండి ప్రత్యేకత

image

18 గ్రామాలతో తనదైన అస్తిత్వం, చుట్టూ గ్రామీణ వాతావరణం, చారిత్రక ఆనవాళ్లు, కరవుకు ఎంతో దూరం.. ఇదీ దుగ్గొండి ప్రత్యేకత. నగరానికి కూరగాయలను ఉత్పత్తి చేసే ప్రాంతంగా దుగ్గొండి మొదటి స్థానంలో ఉండటం విశేషం. ఎన్నో రోగాలకు దివ్య ఔషధమైన తాటికళ్లును అందించే ప్రాంతంగా దుగ్గొండి గుర్తింపు పొందింది. మండల పరిధి కేశవాపురంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి.

error: Content is protected !!