News February 25, 2026

వరంగల్: అకాల వర్షాలు.. మిర్చి రైతులకు గమనిక

image

అకాల వర్షాల దృష్ట్యా మార్కెట్‌కు మిర్చి తీసుకొచ్చే రైతుల బస్తాలు తడవకుండా నిల్వ చేసుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి కె.సురేఖ తెలిపారు. మార్కెట్‌లో మొత్తం 46 షెడ్లుతో 50 నుంచి 80వేల బస్తాలు నిల్వ చేసుకోవడానికి సౌకర్యం ఉందని, 10వేల బస్తాల వరకు తడవకుండా కప్పడానికి టార్పలిన్లు ఉన్నాయన్నారు. క్రయవిక్రయాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు తమ సరుకులను అమ్ముకోవచ్చన్నారు.

Similar News

News April 14, 2026

GNT: ఆంధ్రప్రదేశ్ పోలీసులకు గుడ్‌ న్యూస్

image

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు డీజీపీ కార్యాలయం శుభవార్త చెప్పింది. వారి సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పోలీసు సిబ్బందికి పుట్టినరోజు, పెళ్లిరోజు నాడు కచ్చితంగా సెలవు మంజూరు చేయనున్నారు. సిబ్బంది తమ కుటుంబాలతో ఈ వేడుకలు జరుపుకునేలా ఈ అవకాశం కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా సిబ్బందికి కచ్చితంగా సెలవులు ఇవ్వాలని యూనిట్ అధికారులకు డీజీపీ సర్క్యులర్ జారీ చేశారు.

News April 14, 2026

1,000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగాలు

image

పంజాబ్&సింధ్ బ్యాంకులో 1,000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. TGలో 30 పోస్టులున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, ఏదైనా బ్యాంకులో 18 నెలల పని అనుభవం ఉండాలి. సంబంధిత రాష్ట్రంలోని లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. వయసు 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ APR 20. మరిన్ని వివరాలకు punjabandsind.bank.in చూడండి.

News April 14, 2026

HYD: BJPకి క్రైస్తవుల మద్దతు: TG చీఫ్

image

భిన్నత్వంలో ఏకత్వానికి, సర్వమత సామరస్యానికి భారతదేశం గొప్ప ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. HYDలో క్రైస్తవులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ అభివృద్ధి అజెండాను విశ్వసిస్తూ కేరళం, గోవా లాంటి రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజం పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు తెలుపుతుండటం హర్షణీయమన్నారు.