News March 3, 2025
వరంగల్: అతిపెద్ద రన్ వే ఉన్న ఎయిర్‌పోర్ట్ మనదే!

మామునూర్ విమానాశ్రయాన్ని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వ్యాపారాల కోసం 1930లో నిర్మించారు. నిజాం కాలంలో దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద రన్ వే కలిగిన ఎయిర్‌పోర్ట్ కూడా మనదే. చైనాతో యుద్దం సమయంలోనూ మన ఎయిర్‌పోర్ట్ సేవలందించింది. మాజీ ప్రధాని నెహ్రూ సైతం ఓసారి ఈ ఎయిర్‌పోర్టులో దిగారు. మరి ఎయిర్‌పోర్ట్‌కు ఏ పేరు పెట్టాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News March 4, 2025
నర్సంపేట: ఇద్దరికి జైలు శిక్ష

నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 26వ తేదీన ఇన్‌స్పెక్టర్ రమణమూర్తి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. చెన్నారావుపేట మండలం కోనాపురానికి చెందిన అరవింద్, నర్సంపేట పట్టణానికి చెందిన నాగరాజు పట్టుబడ్డారు. వీరిని నేడు న్యాయస్థానంలో హాజరు పర్చగా మూడు రోజుల జైలు శిక్షతోపాటు రూ.1,000 జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ లక్ష్మీనారాయణ తీర్పు ఇచ్చారు.
News March 4, 2025
దుగ్గొండి: అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య

WGL (D) దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన గందం లక్ష్మీ(52) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. లక్ష్మీ, మొగిలి దంపతులు బర్రెల వ్యాపారం చేశారు. అందులో నష్టాలు రావడంతో 5ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుండగా దిగుబడి రాలేదు. అప్పులను తీర్చలేక 4 రోజుల క్రితం లక్ష్మీ పురుగుల మందు తాగింది. వరంగల్ MGMలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు తెలిపారు.
News March 3, 2025
WGL: శ్రీపాల్ రెడ్డి నేపథ్యం ఇదే..!

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన పింగళి శ్రీపాల్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా గూడూరులో జన్మించారు. ఆయనకు 52 ఏళ్లు. వృత్తి రీత్యా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయన గతంలో PRTU TS, UTF రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(AIFTO) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. కాగా ఇటీవల ఆయన తన టీచర్ పోస్ట్‌కు రాజీనామా చేశారు.