News July 12, 2024

వరంగల్: అధికంగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు పత్తి ధర రూ.160 పెరిగింది. నిన్న రూ.7,300 పలికిన క్వింటా పత్తి.. నేడు రూ.7,460కి చేరింది. ఈ వారంలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ధరలు మరింత పెరగాలని ఆ దిశగా వ్యాపారులు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

Similar News

News December 31, 2025

మెరుగైన వైద్య సేవల కోసం 90 రోజుల యాక్షన్ ప్లాన్: WGL కలెక్టర్

image

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా లోపాల దిద్దులుబాటకు 90 రోజుల యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వెళ్లాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్‌వో, ఎంజీఎం, సీకేఎం, ఆర్ఈహెచ్, నర్సంపేట, వర్ధన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు సంబంధించిన అధికారులతో బుధవారం సమీక్షించారు. వైద్య ఉద్యోగులకు ఫేస్ అటెండెన్స్ తప్పనిసరి చేయాలన్నారు. హాస్పిటల్స్ సూపర్డెంట్లు, అధికారులు పాల్గొన్నారు.

News December 30, 2025

వరంగల్: ఇక మునిసిపల్ పోరుపై రాజకీయం..!

image

రెండు నెలలు గ్రామ పంచాయతీ ఎన్నికల చుట్టు తిరిగిన రాజకీయాలు.. ఇప్పుడు పట్టణ పోరుపై తిరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. దీంతో ఆయా పట్టణాల్లో కౌన్సిల్ స్థానాల ఆశావహులు, నాయకుల మధ్య అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే నర్సంపేటలో బీఆర్ఎస్ నాయకులు వార్డుల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.

News December 30, 2025

వరంగల్: ఉదయం 6 నుంచే యూరియ విక్రయం!

image

వరంగల్ జిల్లాలో రైతుల పంటలకు ఉపయోగించే యూరియ కౌంటర్లు ఉ.6 గం.కు తెరిచి విక్రయించవచ్చని కలెక్టర్ సత్య శారద అధికారులను అదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అవసరం అయితే మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, జిల్లాలో యూరియా డీలర్స్ దగ్గర 434 టన్నుల యూరియా స్టాక్ ఉందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 14375 టన్నులు పంపిణీ చేశామని అన్నారు.