News March 22, 2024
వరంగల్: అన్నదాతకు నిరాశ… తగ్గిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర భారీగా తగ్గింది. గురువారం (నిన్న) క్వింటా పత్తికి రూ.7,315 ధర రాగా.. ఈరోజు (శుక్రవారం) రూ.7250 కి పడిపోయింది. ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. రేపటినుండి మార్కెట్ కు వరుసగా మూడు రోజుల వరుస సెలవులు నేపథ్యంలో ఈరోజు పత్తి తరలివచ్చింది.
Similar News
News December 20, 2025
క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష

క్రిస్మస్ పండుగను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా, వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మూడు నియోజకవర్గాలకు (వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట) ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక్షలతో ఏర్పాట్లు చేయాలని సంబంధిత తహశీల్దార్లను ఆదేశించినట్లు తెలిపారు.
News December 20, 2025
భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

భద్రకాళి ఆలయం శనివారం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. పుష్య మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
News December 20, 2025
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన ఎంపీ కావ్య

WGL కేయూలో అమలవుతున్న రూసా 2.0 (రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్) ప్రాజెక్టుల గడువు పెంచాలని WGL ఎంపీ కడియం కావ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. ఢిల్లీలో ఆమె మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. రూసా కింద మంజూరైన రూ.50 కోట్లతో పరిశోధన కేంద్రాలు, వ్యక్తిగత రీసెర్చ్ ప్రాజెక్టులు, కె-హబ్, మౌలిక వసతుల పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రస్తుత గడువును మార్చి 31, 2027కు పెంచాలన్నారు.


