News December 11, 2024

వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: పొంగులేటి

image

వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి మంత్రి పొంగులేటి బుధవారం వరంగల్ అభివృద్ధిపై మాట్లాడారు. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక హామీలు ఇచ్చారని, ఈ నేపథ్యంలో వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

Similar News

News January 25, 2025

మరియపురం: పథకానికి అనర్హుడినని ముందుకొచ్చిన వ్యక్తికి సన్మానం

image

గీసుగొండ మండలం మరియపురం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో అర్హుల జాబితాను చదవగా అందులో పేరు వచ్చిన గొలమారి జ్యోజిరెడ్డి అనే వ్యక్తి ఆ పథకానికి తాను అనర్హుడనని, ఆ పథకం తనకు వద్దని ముందుకు రాగా మండల ప్రత్యేక అధికారి డి.సురేష్, తహశీల్దార్ ఎండీ రియాజుద్దీన్ అతడిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

News January 25, 2025

ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళి అమ్మవారు

image

వరంగల్‌లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి అమ్మవారు శనివారం సందర్భంగా ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.

News January 25, 2025

మాజీ కౌన్సిలర్ దంపతుల మీద దాడిని ఖండించిన పెద్ది

image

నర్సంపేట మాజీ కౌన్సిలర్ వెంకటమ్మ, స్వామి దంపతుల మీద దాడిని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రోడ్డు వెడల్పులో భాగంగా వెంకటమ్మ, స్వామి ఇంటి గోడను కూల్చే విషయంలో కుట్ర జరిగిందని ఆరోపించారు. దాడి జరిగే సమయంలో పోలీసులను సంప్రదించడానికి ప్రయత్నిస్తే పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేదని పెద్ది ఆరోపించారు. కాంగ్రెస్ వారికి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని పెద్ది ప్రశ్నించారు.