News May 10, 2024
వరంగల్ అభివృద్ధి చెందాలంటే బీజేపీని ఆశీర్వదించాలి: రమేశ్

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరూరిని కోలాట బృందాలు, డప్పు చప్పులతో బీజేపీ కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. వరంగల్ అభివృద్ధి చెందాలన్నా, నిధులు రావాలన్నా.. బీజేపీని ఆశీర్వదించాలని అన్నారు.
Similar News
News February 18, 2025
కేయూ: 105 మంది విద్యార్థినులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

కేయూ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ విద్యార్థినులు 105 మంది వివిధ సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.భిక్షాలు తెలిపారు. ఇన్ఫోసిస్‌లో ఇద్దరు, డిజిగీక్స్ ముగ్గురు, జెన్‌పాక్ట్ 35 మంది, డెల్ఫిటీవీఎస్ 18 మంది, క్యూస్ప్రైడర్ 33 మంది, పెంటగాన్ స్పేస్ 10 మంది, ఎకోట్రైన్స్‌లో నలుగురు ఎంపికయ్యారని చెప్పారు. వీరిని అధ్యాపకులు అభినందించారు.
News February 18, 2025
వరంగల్ నగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు: టీకే శ్రీదేవి

వరంగల్ నగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నివేదిక సమర్పించాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టరేట్ డాక్టర్ టీకే శ్రీదేవి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ‘పీఎం ఈ-బస్ సేవా పథకం’లో భాగంగా వరంగల్ నగరానికి జనాభా ప్రాతిపదికన 100 ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహణ కోసం బల్దియాకు అందజేయనున్నట్లు తెలిపారు.
News February 18, 2025
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

మార్చి 5 నుంచి జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణపై సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద దేవి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు రాసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది తదితరులున్నారు.