News October 22, 2024

వరంగల్: ఆలయ భూముల్లో సోలార్ ప్లాంట్లు

image

ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. విద్యుత్ కొరత అధిగమించేందుకు దేవాదాయ భూముల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఫస్ట్ ఫేస్‌లో ఐదు జిల్లాలోని 231 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

Similar News

News November 17, 2024

నేడు కొమురవెల్లిలో మాయాబజార్ నాటక ప్రదర్శన

image

కొమురవెల్లి శ్రీ మల్లన్న స్వామి ఆలయ సమీపంలో నేడు శ్రీ వినాయక నాట్యమండలి (సురభి) వారి ఆధ్వర్యంలో మాయాబజార్ నాటక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. భక్తులు, ఆలయ సమీప గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని నాటకాన్ని తిలకించి విజయవంతం చేయాలని కోరారు.

News November 17, 2024

WGL: నిరుద్యోగులకు ఈనెల 20న జాబ్ మేళా

image

వరంగల్ జిల్లా ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఉమారాణి శనివారం తెలిపారు. హెచ్‌డి‌ఎఫ్‌సిలో 50, ముత్తూట్ ఫిన్ కార్ప్‌లో 100, సర్వాగ్రామ్ ఫైనాన్స్‌లో 15 ఖాళీల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ వరంగల్ ఐటిఐ బాయ్స్ క్యాంపస్‌కు రావాలన్నారు.

News November 16, 2024

WGL: సీఎం పర్యటన పనులను పరిశీలించిన ఉమ్మడి జిల్లా కలెక్టర్లు

image

ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాల కలెక్టర్లు ప్రావిణ్య, డాక్టర్ సత్య శారదా, దివాకర టీఎస్, రిజ్వాన్ బాషా షేక్, రాహుల్ శర్మ, GWMC అశ్విని తానాజీ వాకడే శనివారం పరిశీలించారు. సీఎం పర్యటన రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. పర్యటన కు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.