News January 30, 2025
వరంగల్: ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించిన వికాస్ రాజ్

వరంగల్ జిల్లాలో నిర్మిస్తోన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ వరంగల్‌కు వచ్చారు. జిల్లా కలెక్టర్ సత్యశారద దేవితో కలిసి బుధవారం ఆసుపత్రి నిర్మాణ పనులను వికాస్ రాజ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులున్నారు.
Similar News
News February 17, 2025
స్కూలు విద్యార్థులకు కంటి పరీక్షలు: డీఎంహెచ్వో

వరంగల్ జిల్లాలో 36,368 మంది విద్యార్థులు ఉండగా అందులో 33,516 మందికి కంటి పరీక్షలు 92.36% నిర్వహించినట్లు డీఎంహెచ్వో సాంబశివరావు తెలిపారు. అందులో నుంచి 1074 మంది కంటి దృష్టి లోపాలతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించామన్నారు. వారికి నేత్ర వైద్యులతో పరీక్షలు చేస్తూ ఆన్‌లైన్లో స్టేట్‌కి పంపించడం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమము నేటి నుంచి మార్చ్ 3 వరకు పూర్తి చేయాలన్నారు.
News February 17, 2025
ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ప్రతిపాదనలు పంపండి: సీడీఎంఏ డా.టికే శ్రీదేవి

ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ప్రతిపాదనలు పంపాలని కమిషనర్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డా.టి కే శ్రీదేవి అన్నారు. హైదరాబాద్ సీడీఎంఏ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు, నిర్వహణపై వీడియో కాన్ఫరెన్ ద్వారా మాట్లాడారు. జీడబ్ల్యూఎంసీ నుంచి బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News February 17, 2025
వరంగల్: మక్కలు క్వింటా రూ.2,355

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం మొక్కజొన్న తరలివచ్చింది. అయితే గత శుక్రవారం లాగే ఈరోజు కూడా మక్కలు (బిల్టీ) ధర రూ.2,355 ధర పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ.7200, పచ్చి పల్లికాయకి రూ.4,100 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.