News February 11, 2025

వరంగల్: ఆహారభద్రత ప్రమాణాలను పాటించాలి: కలెక్టర్

image

జిల్లాలో ఆహారభద్రత ప్రమాణాలను పకడ్బందీగా అమలుచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, జిల్లాస్థాయి అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఆహార ఆహార పదార్థాలతో వ్యాపారాలు చేసేవారు నిబంధనలకు లోబడి ఆహార భద్రత ప్రమాణాలను పాటించాలని సూచించారు.

Similar News

News November 3, 2025

హైదరాబాద్‌లో వర్షం షురూ..

image

TG: హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బాలానగర్, గచ్చిబౌలి, మల్కాజ్‌గిరి, కాప్రాలో వర్షం పడుతోంది. రాబోయే 2 గంటల్లో అమీర్‌పేట్, హిమాయత్‌నగర్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, ఓయూ, చార్మినార్, నాంపల్లిలోనూ వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

News November 3, 2025

HYD: బస్సు ప్రమాదంపై KCR, KTR దిగ్భ్రాంతి

image

మీర్జాగూడ ప్రమాద ఘటనపై మాజీ CM KCR, మాజీ మంత్రి KTR తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోవడం అత్యంత బాధకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి సూచించారు.

News November 3, 2025

స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించగా తమ అభిప్రాయం తెలిపేందుకు గడువు కోరింది. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది.