News July 31, 2024

వరంగల్: ఇంట్లో దూరిన కొండ చిలువ

image

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో బుధవారం కొండచిలువ కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. తురకల సోమారం గ్రామంలోని ఓ ఇంట్లో కొండ చిలువ దూరింది. అనంతరం బోనులో ఉన్న నాటుకోళ్లపై దాడి చేసి చంపేసింది. ఒక్కసారిగా గ్రామంలో కొండ చిలువ ప్రత్యక్షమవడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

Similar News

News October 16, 2024

వరంగల్ జిల్లాలో ఏరులై పారిన మద్యం

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం ఏరులై పారింది. ఈ దసరా పండుగకు రూ.142 కోట్లతో ఎక్సైజ్ ఖజానకు వరంగల్ జిల్లా మందుబాబులు భారీగా ఆదాయాన్ని తీసుకొచ్చారు. గతేడాది రూ.94 కోట్ల ఆదాయం రాగా.. ఈసారి అదనంగా మరో రూ.50 కోట్ల వరకు ఆదాయం పెరిగింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 294 వైన్స్, 134 బార్లు ఉండగా.. పండుగకు 1,29,740 మద్యం కాటన్లు, 2,53,666 బీర్ల కాటన్లు అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు.

News October 16, 2024

జనగామ: గుండెపోటుతో హోంగార్డ్ మృతి

image

గుండెపోటుతో హోంగార్డ్ మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కొడకండ్లలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కొడకండ్ల పోలీస్ స్టేషన్లో ఎండి గౌస్ పాషా(48) హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, పాషా గతంలో దేవరుప్పుల పోలీస్ స్టేషన్లో కూడా విధులు నిర్వహించారు. అందరితో సన్నిహితంగా ఉండే పాషా గుండె పోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News October 16, 2024

వరంగల్ మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు పెరిగాయి. 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.15,000 ధర రాగా.. నేడు రూ.15,500 అయింది. అలాగే తేజ మిర్చి నిన్నటి లాగే రూ.17,500 పలికినట్లు రైతులు తెలిపారు. మరోవైపు వండర్ హాట్ మిర్చి మంగళవారం రూ.14,500 ధర పలకగా నేడు రూ.15 వేలు అయింది.